Site icon NTV Telugu

Nowhera: ఈడీ అధికారులతో చెలగాటం.. బెదిరింపులకు దిగుతోన్న నౌహెరా షేక్‌

Nowhera

Nowhera

హీరా గ్రూప్‌ ఆఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ పర్సన్‌ నౌహెరాషేక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులకు చుక్కలు చూపిస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో కేసు నమోదైందంటేనే ఎంతో మంది వ్యాపారవేత్తలు భయపడిపోతారు. కానీ నౌహెరా షేక్‌ మాత్రం.. ఈడీ అధికారులతో చెలగాటం ఆడుతోంది. కోర్టు ఆదేశాల ప్రకారం, అటాచ్‌ చేసిన ఆస్తులను వేలం వేయడానికి ప్రయత్నిస్తే.. వేలంలో వేసిన వారినే బెదిరింపులకు దిగుతోంది. అంతే కాదు ఈడీ అటాచ్‌ చేసిన ఆస్తుల్లో కొన్నిటిని, అధికారులకే తెలియకుండా విక్రయిస్తోంది.

Also Read:Premanand Maharaj: ప్రేమానంద్ మహారాజ్ కోలుకోవాలని మదీనాలో ప్రార్థించిన ముస్లిం వ్యక్తి.. (వీడియో)

హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెడితే 36 శాతం మేర లాభాలు ఆర్జించవచ్చని.. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ మోసాలకు పాల్పడింది ఆ గ్రూప్ చైర్మన్ నౌహీరా షేక్. బాధితుల నుంచి భారీ ఎత్తున పెట్టుబడులను తన కంపెనీలో పెట్టించి ముఖం చాటేసింది. దీంతో బాధితులు న్యాయం చేయాలంటూ హీరా గ్రూప్‌ చైర్‌ పర్స్‌ నౌహెరా షేక్‌ చుట్టూ తిరిగారు. కానీ.. ఎలాంటి ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించి నౌహెరాషేక్‌‌పై ఫిర్యాదులు చేశారు. దర్యాప్తులో భాగంగా హీరా గ్రూప్‌ సంస్థ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులు నమోదు చేసింది.

నౌహెరాషేక్‌‌పై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఇప్పటికే తీవ్ర నేరారోపణల కేసులు కొనసాగుతున్నాయి. అలాగే సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు సైతం నౌహెరా షేక్‌‌పై నమోదైన కేసులను దర్యాప్తు చేస్తోంది. ఈ క్రమంలో ఈడీ దర్యాప్తులో నౌహెరా షేక్‌ మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించింది. దీంతో ఆమెకు సంబంధించిన పలు ఆస్తులను అటాచ్‌ చేసింది. ఆ ఆస్తులను కోర్టు ఆదేశాలతో వేలం వేయడానికి ప్రయత్నించింది. కాగా.. వేలంలో పాల్గొనడానికి వచ్చిన వారిని నౌహీరాషేక్‌, బెదిరింపులకు దిగుతున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు నౌహీరా.. ఈడీ అధికారులు అటాచ్‌ చేసిన ఆస్తులను అధికారులకు తెలియకుండా అమ్మకాలు చేసింది. సుమారు 3 కోట్ల రూపాయల ప్రాపర్టీని విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అటాచ్‌ చేసిన ఆస్తులను ఎలా విక్రయిస్తారని నౌహెరాను నిలదీశారు. అలాగే.. అటాచ్‌ చేసిన ఆస్తులను రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. కానీ నౌహీరాకు ఓ సబ్‌ రిజిస్ట్రార్‌ సహకరించి.. రిజిస్ట్రేషన్‌ చేసినట్లుగా గుర్తించారు ఈడీ అధికారులు.

Also Read:Siddu Jonnalagadda : హీరోయిన్ల డేట్ల కోసం హీరోలే వెయిట్ చేస్తారు!

హీరా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందిన ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ.. ఇప్పటి వరకు వాటిలో కొన్ని ఆస్తులను వేలం వేసి సుమారు 93 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇంకా మిగిలిన ఆస్తులను వేలం వేయడానికి యత్నిస్తున్న ఈడీ అధికారులతో నౌహీరా షేక్‌ చెలగాటం ఆడుతోంది. ఈడీ ఆధికారులకు సహకరించకండా ఇబ్బందులకు గురి చేస్తోంది. నౌహీరాషేక్‌ ఆగడాలను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఈడీ. దీంతో కోర్టు గతంలో నౌహీరా షేక్‌కు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. నౌహెరాషేక్‌ తక్షణమే ఈడీ ముందుకు విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే..ఈడీ అధికారులకు సహకరించని పక్షంలో.. విచారణకు హాజరుకాని క్రమంలో ఆమెను అరెస్టు చేయవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు.

Exit mobile version