NTV Telugu Site icon

ED Notices KTR: విచారణకు రండి.. కేటీఆర్‌కు ఈడీ నోటీసులు..

Ed Noice Ktr

Ed Noice Ktr

ED Notices KTR: ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇవాళ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 2025 జనవరి 7 న ఈడీ విచారణ కు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో కేటీఆర్‌ సహా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. జనవరి 2, 3 తేదీల్లో విచారణ కు రావాలని నోటీసులో పేర్కొంది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ విచారణ చేస్తోంది. పెమా నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు ఇప్పటికే గుర్తించిన ఈడీ. FEO కు 55 కోట్లు నగదు బదిలీ , ఆర్థిక పరమైన అవకతవకలు జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది.

Read also: KTR: మన్మోహన్ సింగ్‌తో కేసీఆర్‌కు ఎంతో సాన్నిహిత్యం ఉండేది

ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేటీఆర్.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ ఈ నెల 21న హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్‌పై ఇప్పటికే విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈ నెల 30వ తేదీ వరకు కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో విచారణ కొనసాగించవచ్చని పేర్కొంటూ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ, పురపాలక శాఖ కార్యదర్శి దానకిషోర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం.. కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో ‘కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దని’ ఏసీబీ పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు కౌంటర్‌ దాఖలు చేయాలని కేటీఆర్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సమయం కోరగా.. విచారణను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అదేవిధంగా ఈ నెల 31 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
TG Cold Weather: మరోసారి పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పలుచోట్ల కమ్ముకున్న పొగమంచు