NTV Telugu Site icon

TSPSC Paper Leak: పేపర్ లీకేజ్ పై సిట్ కు ఈడీ లేఖ

Ed Latter To Sit

Ed Latter To Sit

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులకు ఈడీ లేఖ రాసింది. ఈడీ డిప్యూటీ డైరెక్టర్ అరుణ్ కుమార్ పేరుతో సిట్ అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ కేస్ కు సంబంధించి 8 అంశాల డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. మీడియా కథనాలు, పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారం, ఇంటలెన్స్ ద్వారా వచ్చిన ప్రాథమిక వివరాలను తమకు ఇవ్వాలని ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు పేర్కొన్నారు.

Read Also : TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు విచారణ వాయిదా..

అయితే అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ సింగ్ పేరుతో నాంపల్లి కోర్ట్ లో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. పీఎంఎల్ ఏ సెక్షన్ 50 కింద ప్రవీణ్, రాజశేఖర్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయనున్న ఈడీ.. చంచల్ గూడా జైలులో ఉన్న నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ లను నలుగురు అధికారులతో కూడిన బృందం విచారిస్తుందని కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ లో మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అభియోగాలు దాఖలు చేసింది. సెక్షన్ 48, 49 కింద నిందితులను ఈడీకి విచారించే అర్హత ఉందని వెల్లడించారు.

Read Also : Ssc Paper Leak : టెన్త్ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురికి బెయిల్ మంజూరు

చంచల్ గూడ జైలులో విచారణ సందర్భంగా లాప్ టాప్, ప్రింటర్, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించాలని కోరుతు ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. జైల్ లో విచారణ సందర్భంగా తగిన ఏర్పాట్లు చేయాలని చంచల్ గూడా సూపరిడెంట్ కు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరారు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 150 మందిని ప్రశ్నించిన సిట్ అధికారులు 17 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 15 మందిని కస్టడిలోకి తీసుకుని వివరాలు రాబట్టారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్థన్ రెడ్డి, సెక్రటరీ అనితా రామచంద్రన్, బోర్డు మెంబర్ లింగారెడ్డి సహా పలువురు స్టేట్ మెంట్స్ రికార్డు చేశారు.

Read Also : Balagam Mogilaiah: ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట పాడి ఏడిపించిన మొగిలయ్య కి తీవ్ర అస్వస్థత

ఈ కేసులో ప్రధాన నిందితులైన రాజశేఖర్, ప్రవీణ్ స్టేట్ మెంట్ రికార్డు చేసేందుకు చంచల్ గూడా జైలులో ఏర్పాట్లు చేస్తే తాము విచారణ చేస్తామని ఈడీ కోర్టుకు తెలిపింది. కోర్టు అనుమతి ఇస్తే పేపర్ లీకేజ్ వ్యవహారంలో భారీగా డబ్బు చేతులు మారినట్లు ఈడీ అనుమనిస్తోంది. మరోవైపు ఈడీ అధికారులు మనీలాండరింగ్ కు సంబంధించి దర్యాప్తులో భాగంగా కేసులో సాక్షిగా ఉన్న సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మితో పాటు మరో ఆఫీసర్ సత్యనారాయణకు నోటీసులు జారీ చేసింది. బుధ, గురువారాల్లో విచారణకు హాజరు కావాలని అందులో స్పష్టం చేసింది.