ఆన్‌లైన్ బెట్టింగ్ 1x బెట్ యాప్ కేసులో భారత క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బిగ్ షాకిచ్చింది. పలువుర సెలబ్రిటీలకు చెందిన కోట్లాది రూపాయల ఆస్తులను (ED) జప్తు చేసింది. 1xBet కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED న్యూ ప్రొవిజనల్ అటాచ్‌మెంట్‌లను చేసింది. ఆస్తులను అటాచ్ చేసిన వారిలో యువరాజ్ సింగ్ , రాబిన్ ఉతప్ప, ఊర్వశి రౌతేలా, సోను సూద్, మిమి చక్రవర్తి, అంకుష్ హజ్రా, నేహా శర్మ ఉన్నారు. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు గుర్తించారు.
1xBet బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బుక్‌మేకర్ అని కంపెనీ పేర్కొంది. దీని కస్టమర్లు వేలాది స్పోర్ట్స్ ఈవెంట్స్ పై బెట్టింగ్ వేయొచ్చు. కంపెనీ వెబ్‌సైట్, యాప్ 70 భాషలలో అందుబాటులో ఉన్నాయి. ఈరోజు జరిగిన చర్యలో, ED మొత్తం రూ. 7.93 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. గతంలో, ఈ కేసులో శిఖర్ ధావన్‌కు చెందిన రూ.4.55 కోట్లు, సురేష్ రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇప్పటివరకు, 1xBet కేసులో ED రూ.19.07 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
యువరాజ్ సింగ్ – రూ. 2.5 కోట్లు
రాబిన్ ఉతప్ప – రూ. 8.26 లక్షలు
ఊర్వశి రౌతేలా – రూ. 2.02 కోట్లు (ఈ ఆస్తి ఊర్వశి తల్లి పేరు మీద నమోదైంది)
సోనూ సూద్ – రూ. 1 కోటి
మిమీ చక్రవర్తి – రూ. 59 లక్షలు
అంకుష్ హజ్రా – రూ. 47. 20 కోట్లు
నేహా శర్మ – రూ. 47.20 లక్షలు
