ED vs West Bengal Govt: ఈడీ vs బెంగాల్ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు చేరిన వివాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ED vs West Bengal Govt: పశ్చిమ బెంగాల్‌లో ఈడీ vs బెంగాల్ ప్రభుత్వం వార్ నడుస్తోంది. ఐ-ప్యాక్ సంస్థపై ఈడీ చేసిన దాడుల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరపాలని ఈడీ కోరుతోంది. ఇప్పటికే ఈ అంశంపై కలకత్తా హైకోర్టును కూడా ఈడీ ఆశ్రయించగా, ఆ పిటిషన్‌పై జనవరి 14న విచారణ జరగనుంది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఐ-ప్యాక్ డైరెక్టర్ ప్రతిక్ జైన్ ఇంట్లో జరిగిన సోదాల సమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ దర్యాప్తును అడ్డుకున్నారని ఈడీ ఆరోపించింది. కీలక పత్రాలను తమ కస్టడీ నుంచి తీసుకెళ్లారని, ఇందుకు రాష్ట్ర పోలీసులు సహకరించారని తెలిపింది. చట్టబద్ధంగా జరుగుతున్న తనిఖీలను అక్రమంగా అడ్డుకున్నారని పేర్కొంది. డిజిటల్ పరికరాలు, ఎలక్ట్రానిక్ డేటా, కీలక ఆధారాలు బలవంతంగా తీసుకెళ్లి దాచేశారని ఈడీ వాదించింది. అయితే ఈడీకి తక్షణ ఉపశమనం ఇవ్వడానికి కలకత్తా హైకోర్టు నిరాకరించింది.
READ MORE: The Rajasaab: ప్రభాస్ ‘రాజాసాబ్’పై కాపీ ఆరోపణలు.. తమన్‌కు విదేశీ డీజే వార్నింగ్
Also Read
- Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- US-Iran War: ఇరాన్ ప్రతీకార దాడులు.. గాయపడిన అమెరికన్ సైనికులు.?
- Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు..
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
ఇదిలా ఉండగా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో క్యావియట్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని కోర్టును కోరింది. మరోవైపు, ఐ-ప్యాక్ సంస్థ ఈడీ దాడులను తీవ్రంగా ఖండించింది. చట్టానికి అనుగుణంగా పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. తాము వృత్తిపరమైన నైతిక విలువలను పాటించామని, జరిగిన పరిణామాల వల్ల తమ పని మీద ప్రభావం పడదని ఐ-ప్యాక్ తెలిపింది. తమ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయదని, రాజకీయ పదవులు చేపట్టదని, పారదర్శకంగా రాజకీయ కన్సల్టెన్సీ సేవలకే పరిమితమని స్పష్టంగా వెల్లడించింది.
READ MORE: Aishwarya Rajesh : ‘ఓ సుకుమారి’ మూవీ నుంచి హోమ్లీ లుక్‌లో పలకరించిన ఐశ్వర్య రాజేష్
తాజావార్తలు
-
Kiran Abbavaram: ‘చెన్నై లవ్ స్టోరీ’పై కిరణ్ ధీమా.. నా కొడుకు అలా పిలిస్తే చాలు అంటూ కామెంట్స్!
-
Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
-
Adluri Laxman : కేటీఆర్ సరూర్ నగర్ సభలో మాట్లాడించింది పెయిడ్ ఆర్టిస్టులతోనే
-
Kiran Abbavaram: “మా అమ్మ ఆరు ఏళ్లు నాకు దూరంగా ఉంది” కిరణ్ అబ్బవరం ఎమోషనల్..
-
Kiran Abbavaram : హీరో ఇమేజ్ కంటే సాధారణ జీవితం ఇష్టం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!