NTV Telugu Site icon

Big News : కరీంనగర్ మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటి సోదాలు

Ed Raids

Ed Raids

తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ మైనింగ్ అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), ఆదాయ పన్ను (ఐటీ)శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మైనింగ్ అక్రమాలపై ఈడీ, ఐటీ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేస్తున్నారు. అయితే.. ఈ సోదాలు కరీంనగర్, హైదరాబాదులో కొనసాగుతున్నాయి. రెండు చోట్ల 30 ప్రాంతాల్లో ఐటీ, ఈడీ 30 టీమ్స్‌తో సోదాలు చేస్తోంది. కరీంనగర్ గ్రానైట్ అక్రమాలపై గతంలోని బీజేపీ నేత పేరాల శేఖర్‌ రావు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సీబీఐ విశాఖ విభాగం అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. కాకినాడ పోర్టు నుంచి కరీంనగర్ గ్రానైట్ విదేశాలకు ఎగుమతి జరిగింది. 2011లో కాకినాడ పోర్టులో అధికారులు సోదాలు నిర్వహించారు.
Also Read : Best Food in Winter : చలికాలంలో తినాల్సిన ఆహారం.. వాటిని అస్సలు తీసుకోవద్దు..

అయితే.. ఆ సోదాల్లో అక్రమంగా గ్రానైట్ విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించారు అధికారులు. అయితే.. అక్రమ ఎగుమతులపై పలు సంస్థలకు నోటీసులు ఇచ్చిన అధికారులు భారీగా జరిమానాలు సైతం విధించారు. అప్పట్లో మైనింగ్ కంపెనీలకు రూ.750 కోట్ల జరిమానా విధించినట్టు బీజేపీ నేత శేఖర్‌రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. అయితే అప్పట్లో.. పన్ను ఎగవేత, మనీలాండరింగ్, అక్రమ మైనింగ్, అక్రమ రవాణా, ఎగుమతులపై కేంద్ర విచారణ సంస్థలు, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టాయి. అయితే.. ఇప్పుడు తాజాగా కరీంనగర్‌ మైనింగ్‌ అక్రమాలపై ఈడీ, ఐటీ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
హైదరాబాద్ లో మరోసారి ఈడీ సోదాలు l NTV