Site icon NTV Telugu

llegal Betting App Case: సురేష్ రైనా, శిఖర్ ధావన్‌లకు ఈడీ షాక్.. రూ.11 కోట్ల ఆస్తులు జప్తు

Ed

Ed

మాజీ క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేష్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ చర్య తీసుకుంది. వీరికి చెందిన రూ.11.14 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. మాజీ క్రికెటర్లు ఇద్దరూ విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా అక్రమ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ 1xBet ను ప్రోత్సహించారని ED దర్యాప్తులో వెల్లడైంది. ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్ 1xBet పై కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ధావన్ కు చెందిన రూ.4.5 కోట్ల విలువైన స్థిరాస్తులు, రైనాకు చెందిన రూ.6.64 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్లను అటాచ్ చేయడానికి తాత్కాలిక ఉత్తర్వు జారీ అయ్యిందని వర్గాలు తెలిపాయి.

Also Read:West Bengal: చెరువులో వందలాది ఆధార్ కార్డులు.. “సర్” సమయంలో బెంగాల్‌లో వివాదం..

1xBet దాని అనుబంధ సంస్థలను ప్రోత్సహించడానికి ఇద్దరు మాజీ క్రికెటర్లు విదేశీ సంస్థలతో యాడ్ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని దర్యాప్తు సంస్థ దర్యాప్తులో తేలింది. ఈ ఇద్దరితో పాటు, ఈ దర్యాప్తులో భాగంగా యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప, నటులు సోను సూద్, ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తి (తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ), అంకుష్ హజ్రా (బెంగాలీ నటుడు) వంటి ఇతర మాజీ క్రికెటర్లను కూడా ఈడీ ప్రశ్నించింది.

Exit mobile version