NTV Telugu Site icon

Chidambaram: సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ.. మాజీ ఆర్థిక మంత్రి ఆగ్రహం..

Chidambaram

Chidambaram

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థ ‘తీవ్రమైన సంక్షోభంలో’ ఉంది అని తెలిపాడు. బీజేపీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు.. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిందన్నారు. 2023 – 2024లో భారత ఆర్ధిక వ్యవస్థ పటిష్టంగా ఉందని బీజేపీ చెప్తుంది.. కానీ, అదే నిజమైతే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఎందుకు తగ్గిపోతున్నాయని ఆయన ప్రశ్నించారు. దీనికి తగిన వివరణ ఎవరూ ఇవ్వలేకపోతున్నారు.. ఎఫ్‌డీఐ అనేది ఒక దేశం, ప్రభుత్వం దాని విధానాలపై విదేశీ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందని చిదంబరం వెల్లడించారు.

Read Also: Allu Arjun Wax statue: ఐకాన్ స్టార్ ఎమోషనల్ పోస్ట్.. గంగోత్రి వచ్చిన రోజే మైనపు విగ్రహం అంటూ..!

ఇక, విదేశీ పెట్టుబడిదారులకు 2023-24లో అలాంటి విశ్వాసం ఈ కేంద్ర ప్రభుత్వంపై బాగా తగ్గిపోయిందని మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. బీజేపీ తనకు తానుగానే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటుంది.. గుడ్ సర్టిఫికేట్ అనేది విదేశీ & భారతీయ పెట్టుబడిదారుల నుంచి రావాలని తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వంపైన పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు. వడ్డీ రేట్లు పెరిగిపోతున్నాయి.. నిజమైన వేతనాలు ఆగిపోయాయి.. రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది, గృహ వినియోగం తగ్గిపోతుంది.. ఇవి తీవ్ర సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఖచ్చితమైన సంకేతాలు.. కానీ ఇవన్నీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం అన్నారు.