Gold and Silver Prices: గోల్డ్ రేటు పరుగులు పెడుతోంది! ఈ యేడాది ఒక్క నెలలోనే రూ. 5వేలు జంప్ కొట్టింది. జనవరి 1న తులం బంగారం 79వేల చిల్లర ఉంటే.. నెల చివరలో 5 వేల 500 పెరిగింది. కిలో వెండి ధర సైతం రూ.95 వేలు దాటింది. త్వరలోనే సిల్వర్ లక్ష మార్కుకు చేరుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.. దేశ రాజధాని ఢిల్లీలో రూ.84,900కి చేరింది. దేశీయంగా కొనుగోళ్ల మద్దతు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలకు రెక్కలు రావడానికి కారణమని బులియన్ మార్కెట్ వర్గాలంటున్నాయి. అయితే, పసిడి ప్రేమికులకు శుభవార్త చెప్పింది కేంద్రం..
Read Also: Kiara Advani: మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లతో రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ..
ఈ ఏడాది బులియన్ మార్కెట్ ధరలు మిశ్రమంగా ఉంటాయని.. ఆర్థిక సర్వే అంచనా వేసింది.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించిన తర్వాత.. సభలో ఆర్థిక సర్వేలను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. అయితే, ఈ ఏడాది బులియన్ మార్కెట్ దరలు మిశ్రమంగా ఉంటాయని అంచనా వేసింది.. ఈ సమయంలో పడిసి ధరలు తగ్గుతాయని పేర్కొంది.. ఇక, బంగారం ధరలు తగ్గినా.. వెండి ధర మాత్రం మరింత కొండెక్కుతుందని స్పష్టం చేసింది.. ఖనిజాల ధరలు కూడా ఈ ఏడాది దిగివస్తాయని అంచనా వేసింది.. మరోవైపు రష్యా చమురు ఎగుమతులపై ఎన్ని ఆంక్షలు విధించినా ఈ సంవత్సరం ముడి చమురు ధరలు పతనం తప్పదని అంచనా వేసింది ఆర్థిక సర్వే.. ఆల్‌టైం హై రికార్డు సృష్టించిన పసిడి ధర ఏ మాత్రం కిందకు దిగివస్తుందో చూడాలి మరి..