Site icon NTV Telugu

Health Tips: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ కూరగాయలు తినండి..!

Liver

Liver

మానవుడి శరీరంలో కాలేయం ఎంతో ముఖ్యమైనది. కాలేయం ఆరోగ్యం పైనే.. శరీరం మొత్తం ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముంటుంది. కామెర్లు నుంచి కొవ్వు కాలేయ సిండ్రోమ్ వరకు కాలేయాన్ని ఎన్నో వ్యాధులు దెబ్బతీస్తాయి. అందుకోసమని కాలేయ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేందుకు మనం తినే కూరగాయల్లో సహాయపడుతాయి. అవెంటంటే..

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం.. ఐదు రోజులలో రెండోసారి

క్రూసిఫరస్ కూరగాయలు
క్రూసిఫరస్ కూరగాయల్లో కాలీఫ్లవర్ కూడా ఒకటి. ఈ కూరగాయలో విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్ బి5, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్స్, ఐరన్, క్యాల్షియం లాంటివి కాలీఫ్లవర్ లో అధికంగా ఉంటాయి. అందుకోసమని ఇది తింటే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

క్యాబేజీ
క్రూసిఫరస్ కూరగాయల్లో క్యాబేజీ కూడా ఒకటి. దీనిలో కూడా పుష్కలంగా పోషకాలు ఉంటాయి. విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. క్యాబేజీలో విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ ‘సి’ లతో పాటుగా మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సోడియం, పొటాషియం, సల్ఫర్ లు అధికంగా ఉంటాయి. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

Rohit Sharma: ఏడో స్థానంలో రోహిత్ బ్యాటింగ్.. ఎప్పుడు వచ్చాడంటే..?

బీట్ రూట్
బీట్ రూట్ లో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. బీట్ రూట్ లో నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ కూడా కలిగి ఉంటుంది. ఇవి కూడా కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాలెయ పనితీరును మెరుగుపరుస్తాయి.

బ్రోకలీ
బ్రోకలీలో సల్ఫర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాలేయంలోని టాక్సిన్స్ ను బయటకు పంపడానికి ఈ కూరగాయ సహాయపడుతుంది. అంతేకాకుండా బ్రోకలీని ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికే మంచిది.

Exit mobile version