NTV Telugu Site icon

Best foods to build muscle: కండరాలు బలంగా మారాలంటే ఈ ఫుడ్స్ తినండి..

New Project (14)

New Project (14)

శరీరం దృఢంగా, బలమైన కండరాలు కలిగి ఉండాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఇందుకోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి తగినట్టుగా జిమ్‌కెళ్లి రకరకాల వ్యాయామాలు చేసి కష్టపడుతుంటారు. అయినప్పటికీ, సహజంగా కండరాల బరువు పెరగడం అంత తేలికైన పని కాదు. మరికొందరు త్వరగా కండలు రావడానికి ప్రొటీన్​ సప్లిమెంట్లతోపాటు స్టెరాయిడ్స్ కూడా వాడతారు. దీంతో అనారోగ్యం బారిన పడుతుంటారు. అయితే మేము చెప్పే ఈ అయిదు రకాల ఆహార పదార్థాలతో కండరాలను మెరుగు పరుచుకోండి. ఒక పరిశోధన ప్రకారం.. మీరు కండరాలను బలంగా, ఫ్లెక్సిబుల్‌గా మార్చాలనుకుంటే కిలోగ్రాము బరువుకు 1.4 నుండి 2 గ్రాముల ప్రోటీన్ తినవలసి ఉంటుంది. దీంతో పాటు కసరత్తులు చేయాల్సి ఉంటుంది. మీరు మీ కండరాలకు జీవం పోయగలిగే ప్రోటీన్‌తో కూడిన అటువంటి 5 ఆహారాల గురించి ఇక్కడ చూద్దాం.

READ MORE:Komatireddy Rajagopal Reddy: చర్లగూడెం ప్రాజెక్ట్ వద్ద భూ నిర్వాసితులతో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

86 గ్రాముల సోయాబీన్స్‌లో 16 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. మీరు శాఖాహారులైతే సోయాబీన్స్ మీకు ముఖ్యమైనది. సోయాబీన్స్ అంటే మీరు పప్పుదినుసుల ఆకుపచ్చ కూరగాయలలో ఏదైనా తీసుకోవచ్చు. ఈ పదార్థాలు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. మీరు నాన్ వెజ్ తినేవాళ్లయితే కండరాలను పెంచుకోవడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదు. రోజూ చికెన్ బ్రెస్ట్ ను కొన్ని రోజులు తినండి. కేవలం 85 గ్రాముల చికెన్ నుండి 26.7 గ్రాముల ప్రోటీన్ పొందుతారు. అందులోనూ హైక్వాలిటీ ప్రొటీన్ లభ్యమవుతుంది. చికెన్‌లో విటమిన్ బి,బి6 ఉన్నాయి, ఇవి కండరాలలో బలాన్ని పొందేందుకు చాలా ముఖ్యమైనవి. ప్రతి ప్లేస్ లో సాల్మన్ చేపలు దొరకడం కష్టం అయినప్పటికీ, సాల్మన్ చేప కండరాల కోసం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 85 గ్రాముల సాల్మన్ చేపలలో 17 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. దీంతో పాటు ఇందులో 1.5 గ్రాముల ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, అనేక రకాల విటమిన్లు ఉంటాయి. ఇవన్నీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

READ MORE: KCR: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

ప్రోటీన్ పౌడర్ కండరాల బలాన్ని పెంచడానికి కూడా ఒక అద్భుతమైన మూలం. ప్రొటీన్ పౌడర్ చేయడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకుని ఓట్స్, ముతక గింజలు మొదలైన వాటి పౌడర్ తయారు చేసి, అన్నీ కలిపి పౌడర్ సిద్ధం చేసుకోవాలి. దానిని తినండి. కొన్ని నెలల్లో అద్భుతమైన రిజల్ట్ కనబడుతుంది. ప్రతిరోజూ గుడ్లు తీసుకోవాలి. గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది, ఇది కండరాల నిర్మాణానికి, దాని పునరుద్ధరణకు చాలా ముఖ్యమైనది. అయితే రోజూ 2 నుండి 3 గుడ్లు మాత్రమే తినండి, అది కూడా కొంత సమయం వరకు. సాధారణంగా ఒకటి నుండి రెండు గుడ్లు తినడం మంచిది.