హైదరాబాద్ & సికింద్రాబాద్ లోక్ సభ స్థానాలకు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం మిషన్ లు & పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. క్రిటికల్ ఏరియాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు ఆయా జోన్ల డీసీపీలు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మాట్లాడుతూ.. ఈస్ట్ జోన్ లో సమస్యత్మక సునితమైన ప్రాంతాలు ఉన్నాయని, ఈస్ట్ జోన్ లో 225 లోకేషన్ లో మొత్తం 539 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు గిరిధర్. వీటిలో 46 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 4 ఏసిపి డివిజన్స్ 10 పోలీస్ స్టేషన్ల గాను భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామన్నారు గిరిధర్. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును విరిగించుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని, డి అర్ సి సెంటర్స్ నుంచి ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇవి ఎం మిషన్స్ వచ్చాయని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత కలిపించామన్నారు. పోలింగ్ కేంద్రాలో సీసీ కెమెరాలతో సర్వేలెన్స్ చేస్తున్నామని, సెంట్రల్ ఫోర్స్ ఆయా జిల్లా నుంచి వచిన ఫోర్స్ తో కమ్యూనికేషన్ లో ఉన్నామని ఆయన తెలిపారు.
