Site icon NTV Telugu

Cock Fightings: కోడి పందాలు.. జిల్లా కలెక్టర్‌ సీరియస్‌ వార్నింగ్‌

Collector Madhavi Latha

Collector Madhavi Latha

Cock Fightings: సంక్రాంతి వచ్చేస్తోంది.. పండుగ అంటేనే ఆంధ్రప్రదేశ్‌లో.. మరీ ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల్లో కోడిపందాలు, గుండాట.. ఇలా అనేక రకాల ఆటలు ఆడుతుంటారు.. ఇక, కోడి పందాలు కోట్లలో జరుగుతాయి.. కొందరు సర్వం కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి.. అయితే, తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలను నిరోధించడానికి జిల్లా కలెక్టర్ మాధవీలత హెచ్చరికలు జారీ చేశారు.. జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరగడానికి వీలులేదని స్పష్టం చేసిన ఆమె.. ఒకవేళ పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరించారు. పండుగ దినాల్లో కోడి పందాల నిరోధానికి 144 సెక్షన్ అమలులో ఉందని పేర్కొన్నారు. కోడిపందాలతో పాటు ఇతర నిషిద్ధ ఆటలను ఆడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని వార్నింగ్‌ ఇచ్చారు.

Read Also: Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!

కోడి పందాల నిషేధ ఉత్తర్వులు అమలకు గ్రామ కమీటీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు కలెక్టర్‌ మాధవీలత.. కోడిపందాల నిషేధంపై గ్రామాలలో టామ్ టామ్ వేయించడం, మైక్ ప్రచారం చేయించడం, కరపత్రాలు పంపిణీకి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు.. గత సంవత్సరం కోళ్ల పందాల నిర్వహణకు, బరుల ఏర్పాటుకు స్థలాలు ఇచ్చిన భూయజమానులను గుర్తించి ముందుగా నోటీసులు జారీ చేస్తున్నారు అధికారులు.. నిబంధనలను అతిక్రమించి పందాలు జరిగితే గ్రామ, మండల కమిటీలను బాధ్యులుగా చేస్తామని సీరియర్‌గా హెచ్చరించారు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. కాగా, ప్రతీ ఏడాది కోడి పందాల నిర్వహణపై ప్రభుత్వం సీరియస్ గా హెచ్చరించినా.. కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు కొనసాగుతోన్న విషయం విదితమే.

Exit mobile version