Earthquake: మంగళవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించిన తర్వాత సీలింగ్ ఫ్యాన్‌లు, గృహోపకరణాలు వణుకుతున్న వీడియోలను పంచుకున్న పలువురు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు ఈ ఒక్క నెలలోనే మూడోసారి కావడం గమనార్హం.
WHO: చిన్నారుల మరణాలకు కారణం అయిన దగ్గుమందులపై చర్యలు తీసుకోవాలి.
దాదాపు 15 సెకన్లు పాటు భూమి కంపించడంతో ఇళ్లు, కార్యాలయాల్లో ఉన్న ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం.. భూకంప కేంద్రం నేపాల్‌లో కేంద్రీకృతమై ఉంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.8గా నమోదైంది.