Site icon NTV Telugu

Earthquake: లడఖ్‌లోని కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం.. ఉత్తర భారత్‌, పాకిస్తాన్‌లో ప్రకంపనలు

Earthquake

Earthquake

Earthquake: సోమవారం లడఖ్‌లోని కార్గిల్‌లో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించిన తరువాత ఉత్తర భారతదేశం, పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్‌పై 5.5గా నమోదైన ఈ ప్రకంపనలు మధ్యాహ్నం 3:48 గంటలకు సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనలతో పరుగులు తీశారు.

Read Also: Parliament: లోక్‌సభలో 33 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం భూమికి దిగువన 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌తో పాటు పలు ఇతర పరిసర ప్రాంతాల్లో కనిపించాయి. ఈరోజు తెల్లవారుజామున పాకిస్థాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Exit mobile version