NTV Telugu Site icon

Earthquake : ఇండోనేషియాలో భూకంపం.. ఈ వారంలో రెండోది

Earthquake

Earthquake

Earthquake : వరుస భూకంపాలతో ఇండోనేషియా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. వారం కిందే ఆ ద్వీపంలో భూకంపం సంభవించింది. మళ్లీ 6.2తీవ్రతతో భూమి కంపించింది. ఈ రోజు ఉద‌యం 6:30 గంట‌ల‌కు సుమ‌త్రా దీవుల్లో భూకంపం ఏర్పడింది. 80 కిలోమీట‌ర్ల లోతులో భూకంప కేంద్రం ఉంద‌ని అమెరికాకు చెందిన జియోలాజిక‌ల్ స‌ర్వే వెల్లడించింది. భూకంప తీవ్రతకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

Read Also: Nepal Plane Crash : విషాదం.. తన భర్తలాగే ప్రాణాలు కోల్పోయిన కో ఫైలట్

ఇటు, ఇండోనేషియా వాతావ‌ర‌ణ సంస్థ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేయకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘ఎసెహ్‌, ద‌క్షిణ సుమ‌త్రాలోని నాలుగు జిల్లాల్లో మాత్రమే భూమి కంపించింది. అది కూడా 3 నుంచి 10 సెక‌న్లు అంతే’ అని ఆ దేశ వాతావ‌ర‌ణ కేంద్ర ప్రతినిధి అబ్దుల్ ముహారీ వెల్లడించాడు. వారం క్రితం త‌నింబ‌ర్ ప్రాంతంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. ఇండోనేషియాలో త‌ర‌చూ భూకంపాలు రావ‌డం, ఆగ్నిప‌ర్వతాలు బద్ధలు అవుతుంటాయి. అందుకు కార‌ణం ఆ దేశం, ప‌సిఫిక్ మ‌హా స‌ముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండ‌డ‌మే. అందుక‌నే త‌ర‌చూ భూ ప‌ల‌క‌లు ఢీకొంటాయి. దాంతో, భూకంపం, అగ్నిప‌ర్వతం పేలుళ్లు సంభ‌విస్తాయి.