నేపాల్‌లో శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపం దాటికి మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు అక్కడి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. విపరీతమైన చలిలో వీధుల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మళ్లీ భూకంపం వస్తుందనే భయంతో ఇళ్లకు వెళ్లకుండా అందరూ ఒక్కచోట కూడి ఉంటున్నారు. భూకంపం కారణంగా నేపాల్‌లో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి.
Read Also: Ambati Rambabu: విలువలు లేని తమకే ఇది సాధ్యం.. పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి సెటైర్..!
మరోవైపు భూకంపం ప్రమాదంలో మృతిచెందిన వారిని దహనం చేయడానికి అక్కడి ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. భూకంపంలో గాయపడిన వారికి చికిత్స కొనసాగుతున్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. 2015 భూకంపం తర్వాత నేపాల్‌లో శుక్రవారం సంభవించిన భూకంపం అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతున్నారు.
Read Also: Air Pollution: వాయు కాలుష్యం బారినపడకుండా ఉండటానికి ఈ సలహాలు పాటించండి..!
ఇదిలా ఉంటే.. బాధితులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నేపాల్ ఉప ప్రధాని నారాయణ్ ఖాజీ శ్రేష్ఠ తెలిపారు. ఈ ప్రమాదంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని.. వారి కోసం టెంట్లు, ఆహారం పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. కొండ ప్రాంతం కావడంతో కొంత ఆటంకం కలుగుతోందని సహాయక చర్యల్లో నిమగ్నమైన అధికారులు చెబుతున్నారు. కొండ గ్రామాలకు వెళ్లాలంటే కాలినడకనే వెళ్లాలి. అయితే.. భూకంపం కారణంగా కొండచరియలు విరిగిపడటంతో రోడ్లు మూసుకుపోయాయి. దీంతో భూకంప ప్రభావిత ప్రాంతాలకు నేపాల్ ప్రభుత్వం సైనిక హెలికాప్టర్ల ద్వారా సహాయక సామగ్రిని సరఫరా చేస్తోంది.