Site icon NTV Telugu

Manipur Earthquake: మణిపూర్‌లో భూకంపం.. 3.1 తీవ్రత నమోదు

Earth Quake

Earth Quake

మణిపూర్‌లోని చురచంద్‌పూర్‌లో ఆదివారం సాయంత్రం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రతగా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ప్రకారం.. ఆదివారం సాయంత్రం 5:42 గంటలకు భూకంపం వచ్చినట్లు తెలిపింది. ఒక్కసారిగా భూమి కంపించండంతో భయంతో జనాలు ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. అంతకుముందు రోజు తెల్లవారుజామున 1 గంటలకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో 3.6 తీవ్రతతో భూకంపం ఎన్‌ఎస్‌సి తెలిపింది. అయోధ్యకు ఉత్తరాన 215 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఎన్‌సీఎస్‌ వెల్లడించింది.

Read Also: VarunLav: వరుణ్- లావణ్య రిసెప్షన్.. లావణ్య లుక్ పైనే అందరి చూపు

ఇదిలా ఉంటే.. నేపాల్‌లో శుక్రవారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రమాద దాటికి ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. భూకంపంతో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితుల కోసం నేపాల్ ప్రభుత్వం సైనిక హెలికాప్టర్ల ద్వారా సహాయక సామాగ్రిని సరఫరా చేస్తోంది.

Exit mobile version