Indonesia: భారీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.0
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indonesia EarthQuake: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. బాలి, లోంబోక్ దీవులకు ఉత్తరాన సముద్రంలో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున స్థానిక కాలమానం ప్రకారం 4 గంటల సమయంలో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది. ఇండోనేషియాలోని మాతరాంకు ఉత్తరాన 201 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఆ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా భూ అంతర్భాగంలో 516కిలోమీటర్లు దిగువన కదలలికలు సంభవించాయి.
Also Read: Viral Video: పరీక్షల్లో కూతురికి వచ్చిన సున్నా మార్కులు.. ఆ తల్లి ఏం చేసిందో అస్సలు ఊహించలేరు
Also Read
- BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
- Nepal Gorkhas: "మేము భారత సైన్యంలో చేరుతాం".. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
- CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
- 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
కాగా భూకంప తీవ్రత 7.1గా నమోదయిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. మరోవైపు 6.5 తీవ్రతతో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలసీ (NCS) పేర్కొంది. ఇది మాత్రమే కాకుండా వరుసగా ఆ తర్వాత 6.1, 6.5 తీవ్రతతో రెండు భూకంపాలు సంభవించాయని ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. ఇవి ఇలావుండగా సముద్రంలో చాలా లోతులో భూమి కంపించడం వల్ల సునామి వచ్చే అవకాశం లేదు. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. అయితే బాలి ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అనే విషయం తెలిసిందే. ఎప్పుడూ ఇక్కడ చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. అయితే భూకంపం కారణంగా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో టూరిస్టులు భయభ్రాంతులకే గురయ్యారు. బాలిలోని మెర్క్యూరీ కుటాలోని ఓ హోటల్ లో ఉన్న టూరిస్టులు ఆందోళనకు గురై ఏం జరుగతుుందో తెలియక తమ గదుల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత ఎక్కువగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం లేదని తెలుసుకొని మళ్లీ తిరిగివచ్చినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రమాదం జరగపోవడంతో ప్రజలు, టూరిస్టులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Hey, everyone. Woke up at 4am here in Bali with hotel swaying. Earthquake. Just posting to say my daughter & I are safe. Prayers for anyone affected by this event. #earthquake #Indonesia #Bali pic.twitter.com/5gAIyFma1I
— Gregory Bledsoe MD MPH MBA (@ghbledsoe) August 28, 2023
తాజావార్తలు
-
BSNL రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చేసింది.. అన్లిమిటెడ్ కాలింగ్, 24 రోజుల వ్యాలిడిటీ..!
-
Vishwanath And Sons Review : విశ్వనాథ్ అండ్ సన్స్ ఓవర్సీస్ రివ్యూ.. సూపర్బ్ ఫస్టాఫ్.. సెకండాఫ్?
-
Nepal Gorkhas: “మేము భారత సైన్యంలో చేరుతాం”.. నేపాల్‌లో రోడ్డెక్కిన యువత
-
AI Jobs Impact: AI ప్రభావం.. 9.2 కోట్ల ఉద్యోగాలు మాయం.. కానీ, 17 కోట్ల కొత్త ఉద్యోగ అవకాశాలు
-
CM Chandrababu: డీఎస్సీపై కౌంటర్ ఎటాక్.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Honor Magic 9 సిరీస్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
కొత్త ‘ఆలివ్ మాట్రిక్స్ డిస్ప్లే’తో.. ఆగస్టు 18న POVA 8 Pro లాంచ్..!
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!