Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Early Age Sex Results: చిన్న వయసులోనే లైంగిక జీవితాన్ని ప్రారంభించడం భవిష్యత్తులో ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని తాజా అధ్యయనం వెల్లడించింది. చైనాలోని షాన్డాంగ్ విశ్వవిద్యాలయం (Shandong University) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. తక్కువ వయసులో మొదటిసారి శారీరక సంబంధం కలిగిన వారిలో వృద్ధాప్య లక్షణాలు త్వరగా కనిపించే అవకాశం ఉందని తేలింది.
ఈ పరిశోధన ఓ ప్రముఖ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈ తాజా అధ్యయనం ప్రకారం.. చిన్న వయసులోనే శృంగార జీవితాన్ని ప్రారంభించే వారిలో శారీరక బలహీనత, ఆరోగ్య సమస్యలు, జీవితకాలం తగ్గే ప్రమాదం లాంటివి ఎక్కువగా ఉండొచ్చని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు పెద్ద స్థాయిలో జన్యు (DNA) డేటాను విశ్లేషించారు. వ్యక్తులు మొదటిసారి ఎప్పుడు లైంగిక సంబంధం కలిగారనే అంశానికి సంబంధించిన జన్యు సూచనలను పరిశీలించి, వాటిని భవిష్యత్తులో ఆరోగ్య పరిస్థితులతో పోల్చారు.
Also Read
- Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
పరిశోధకుల ప్రకారం.. చిన్న వయసులో శృంగార జీవితాన్ని ప్రారంభించడం నేరుగా వృద్ధాప్యానికి కారణమవుతుందని చెప్పలేము. అయితే మానసిక ఆరోగ్య సమస్యలు, ప్రమాదకర ప్రవర్తనలు, దీర్ఘకాలిక వ్యాధులు, ఒత్తిడి వంటి అనేక అంశాలు కలిసి ఈ ప్రభావానికి కారణమయ్యే అవకాశముందని వారు చెప్పుకొచ్చారు. ఈ సంబంధానికి కారణమయ్యే అంశాలను తెలుసుకోవడానికి పరిశోధకులు 145 రకాల కారకాలను పరిశీలించారు. వాటిలో 34 అంశాలు ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ADHD, డిప్రెషన్ లక్షణాలు, COPD వంటి శ్వాసకోశ సమస్యలు, శారీరక బలహీనత వంటి అంశాలు ఎక్కువగా ప్రభావం చూపినట్లు అధ్యయనం వెల్లడించింది.
ఇక ఈ పరిశోధనలో కీలక రీసెర్చ్ మాట్లాడుతూ.. “చిన్న వయసులో ఎదురయ్యే అనుభవాలు మానసిక ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు, శారీరక సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు” అని తెలిపారు. అలాగే యవ్వన దశలోనే సరైన మానసిక ఆరోగ్య సహాయం, లైంగిక ఆరోగ్య అవగాహన, ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు కల్పించడం ద్వారా భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను తగ్గించవచ్చని సూచించారు.
తాజావార్తలు
-
Sharwanand : ఓ హిట్ కొట్టాడో లేదో శర్వానంద్ రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయట
-
Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
-
Srikakulam Rains: చిగురుటాకులా వణుకుతోన్న శ్రీకాకుళం.. విద్యాసంస్థలకు ఇవాళ, రేపు సెలవు!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!