Site icon NTV Telugu

Eagle Collections: రవితేజ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్స్.. యుద్ధకాండపై పెరిగిపోతున్న అంచనాలు!

Eagle 2

Eagle 2

Eagle Movie 1st Day Box Office Collections: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఈగల్‌’. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్‌గా నటించిన ఈగల్‌ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి టాక్ వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ అందుకున్న ఈగల్‌ చిత్రం ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

ఈగల్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.11.90 కోట్లు వసూళ్లు చేసింది. మొదటి రోజు భారత దేశవ్యాప్తంగా రూ.6 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 37.48 శాతం ఆక్యుపెన్సీని, హిందీలో 7.46 ఆక్యుపెన్సీ శాతం నమోదు అయ్యింది. రవితేజ కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ వీకెండ్ (శని, ఆది) రెండు రోజుల్లో ఈగల్ కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. మాస్ థ్రిల్లర్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో ఫైట్స్, క్లైమాక్స్ హైలెట్‌గా నిలిచాయి.

Also Read: India Squad: చివరి మూడు టెస్టులకు భారత్ జట్టు ప్రకటన.. కోహ్లీ ఔట్, ఆకాష్ ఇన్!

‘సూర్య వర్సెస్ సూర్య’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ కార్తీక్‌ ఘట్టమనేని.. ఈగల్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇందులో రవితేజ పాత్రను చూపించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది. రవితేజ సరికొత్త పాత్ర, యాక్షన్ సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకున్నాయి. రావణాసుర, టైగర్‌ నాగేశ్వరరావు చిత్రాల ప్లాఫులతో డీలాపడిన రవితేజకు ఈగల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందించింది. ఈ సినిమా విజయంను రవితేజ ఎంజాయ్ చేస్తున్నారు.

Exit mobile version