NTV Telugu Site icon

Duvvada Srinivas and Vani: పోటీ నుంచి తప్పుకున్న భార్య..! దువ్వాడకు లైన్‌ క్లియర్‌

Duvvada

Duvvada

Duvvada Srinivas and Vani: శ్రీకాకుళం జిల్లా టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్టుగా తెలుస్తోంది.. దువ్వాడకు ఇంటి పోరు తప్పేలా లేదు అనే ప్రచారం జోరుగా సాగింది.. ఆయనపై సొంత భార్య దువ్వాడ వాణి పోటీకి సిద్ధం కావడమే దీనికి ప్రధానం కారణం.. తాను స్వతంత్ర అభ్యర్థిగా తాను బరిలోకి దిగుతానని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ భార్య, జెడ్పీటీసీ సభ్యురాలైన దువ్వాడ వాణి.. తన అనుచరుల సమక్షంలో ప్రకటించడం కలకలం రేపింది.. ఆమె ప్రకటించిన ప్రకారం.. ఈ నె 22న అంటే సోమవారమే నామినేషన్‌ వేయాల్సి ఉంది… కానీ, నామినేషన్‌ వేయడంపై వెనక్కి తగ్గారట దువ్వాడ వాణి.. టెక్కలిలో వైసీపీ రెబల్ అభ్యర్థిగా 22న నామినేషన్ వేసేందుకు రెడీ అన్న దువ్వాడ వాణి.. ఇప్పుడు పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

Read Also: Gita Sabharwal: ఇండోనేషియాలో యూఎన్‌ రెసిడెంట్ కోఆర్డినేటర్‌గా గీతా సబర్వాల్ నియామకం

అయితే, తమ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌ ఇంటిపోరుపై దృష్టి పెట్టిన వైసీపీ అధిష్టానం.. రంగంలోకి దిగి దువ్వాడ వాణితో మంతనాలు జరిపిందట.. దువ్వాడ వాణిని బుజ్జగించినట్టు టాక్‌ వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలోనే దువ్వాడ వాణి వెనక్కి తగ్గినట్టుగా తెలుస్తోంది.. ఇక, తన భార్య పోటీకి దూరంగా ఉంటానని చెప్పడంతో.. దువ్వాడ శ్రీనివాస్ కు లైన్ క్లియర్‌ అయినట్టుగా తెలుస్తోంది.. మొత్తానికి భర్తపై భార్య పోటీ లేనట్టే అన్నమాట.. తాజా పరిణామాలతో టెక్కలి నియోజకవర్గం వైసీపీ శ్రేణుల్లో జోష్‌ కనిపిస్తుందంటున్నారు. కాగా, తన భార్య వాణి నామినేషన్ వేస్తానన్న వ్యాఖ్యలపై ఆ మధ్య స్పందించిన టెక్కలి వైసీపీ అభ్యర్ధి దువ్వాడ శ్రీనివాస్… వాణి నా భార్య.. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా నామినేషన్ వేసే, పోటీ చేసే అధికారం ఉంది.. కాదని చెప్పే అర్హత ఎవరికీ లేదని కామెంట్‌ చేశారు.. ఏం చేస్తాం.. కలియుగ ప్రభావం.. సొంత అన్నదమ్ములు, కుటుంబం తిరగబడవచ్చు.. కానీ, ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా చెప్పుకొచ్చారు.. అయితే ఆమె నామినేషన్ వేయరనే నేను అనుకుంటున్నానంటూ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం విదితమే.