చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసర పండుగను జరుపుకుంటారు. అయితే, ఈ రోజు రాముడు లంక రాజు అయినా.. రావణుడిని వధించి విజయం సాధించాడని ప్రజలు నమ్ముతారు. అందుకే, చెడుపై మంచి గెలిచిన దానికి చిహ్నంగా ప్రతి ఏడాది విజయదశమి రోజున రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసే సంప్రదాయం వస్తుంది. కానీ, భారతదేశంలో కొన్ని చోట్ల రావణుడి దిష్టిబొమ్మను అస్సలు దహనం చేయరు. ఎందుకో తెలుసా..?
Read Also: IND vs NZ: క్యాచ్ మిస్ చేసిన జడ్డూ.. తన భార్య రివాబా రియాక్షన్ ఇదే..!
అయితే, రావణాసురుడి భార్య మండోదరి జన్మస్థలం మందసౌర్ అని పిలుస్తుంటారు. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని తమ అల్లుడిగా భావిస్తారు. అందుకే అల్లుడి మరణం వాళ్లకు సంతోషాన్ని ఇవ్వదు.. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడి దహనం చేసేందుకు ఇష్టపడరు. ఇక్కడ రావణుని మరణానికి దసర పండగా నాడు సంతాపం తెలియజేస్తారు. అంతేకాకుండా.. ఇక్కడ 35 అడుగుల ఎత్తైన వణాసురుడి విగ్రహం కూడా ఉంటుంది.
Read Also: Azam Khan: “మేము ఎన్‌కౌంటర్ కావొచ్చేమో”.. యూపీ నేత ఆజం ఖాన్ కీలక వ్యాఖ్యలు..
ఇక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిస్రాఖ్ గ్రామంలో వణాసురుడి జన్మించాడనే గట్టి నమ్మకం. అందుకే అక్కడి ప్రజలు రావణుడిని తమ పూర్వీకుడిగా కొలుస్తారు. అందుకే దసరా పండగ రోజు అతని ఆత్మకు శాంతి కలగాలని ప్రత్యేక పూజలు చేస్తారు. రావణుని తండ్రి విశ్రవ మహర్షి ఇక్కడ ఒక శివలింగాన్ని స్థాపించాడని కూడా నమ్ముతారు. దీనికి గౌరవార్థం ఈ ప్రదేశానికి బిస్రాఖ్ అని పేరు కూడా పెట్టారు. అయితే, ఇక్కడి ప్రజలు రావణాసురుడిని మహా బ్రాహ్మణుడిగా భావిస్తారు.
Read Also: Jabardasth Dhanraj: పవన్ డైరెక్టర్ నే డైరెక్ట్ చేయబోతున్న జబర్దస్త్ కమెడియన్
దీంతో, కాంగ్రాలోని లంకాధిపతి శివుని కోసం కఠిన తపస్సు చేసి.. పరమేశ్వరుడికి ఆశీస్సులు పొందాడని ఇక్కడి ప్రజల్లో ఓ నమ్మకం ఉంది. అందుకే ఇక్కడి ప్రజలు రావణుడిని మహాదేవుని భక్తుడిగా వారు భావిస్తారు. అందువలన ఇక్కడ కూడా రావణ దహనం చేయరు. అయితే, ఈ ప్రదేశం మండోదరి తండ్రికి రాజధానిగా ఉండేదని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. రావణుడు మండోదరిని ఇక్కడే పెళ్లి చేసుకున్నాడని స్థానిక ప్రజలు చెబుతున్నారు. అందుకే ఇక్కడి ప్రజలు విజయదశమి నాడు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు. ఈ ప్రదేశంలో గోండు తెగకు చెందిన ప్రజలు నివసిస్తుంటారు. వీరు తమను తాము రావణుడికి వారసులుగా భావిస్తారు. వీళ్లు రావణుడిని పూజిస్తారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. తులసీదాస్ రామాయణం మాత్రమే రావణుడిని చెడ్డదిగా చూపిస్తుందట. అందుకే ఈ ప్రదేశంలో కూడా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయరు.
