SA20 2024: హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం.. సౌతాఫ్రికా టీ20 ఫైనల్‌కు సూపర్ జెయింట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Durban Super Giants Reach SA20 2024 Final: డర్బన్ సూపర్ జెయింట్స్ టీమ్ సౌతాఫ్రికా టీ20 లీగ్ 2024 ఫైనల్‌లో అడగుపెట్టింది. గురువారం వాండరర్స్ స్టేడియంలో జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫైయర్-2లో 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన డర్బన్.. తొలిసారి ఫైనల్‌కు చేరుకుంది. డర్బన్ గెలుపులో హెన్రిస్ క్లాసెన్ (74; 30 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సులు), జూనియర్ డాలా (4 వికెట్స్) కీలక పాత్ర పోషించారు. ఫిబ్రవరి 10న కేప్‌టౌన్ వేదికగా జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, డర్బన్ సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. హెన్రిస్ క్లాసెన్ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. 30 బంతుల్లోనే 3 ఫోర్లు, 7 సిక్సర్లతో ఏకంగా 74 పరుగులు చేశాడు. క్లాసెన్ సిక్సులు వర్షం కురిపించడంతో డర్బన్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. వియాన్ ముల్డర్ (50; 23 బంతుల్లో 3, ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించాడు. జోబర్గ్ సూపర్ జెయింట్స్ బౌలర్లలో నంద్రే బర్గర్, బ్రెస్‌వెల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- 24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
Also Read: IPL 2024: ప్రతి జట్టు ఆటగాళ్లకు ఐపీఎల్ 2024 ఏంతో కీలకం!
212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జోబర్గ్ సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌట్ అయింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో మొయిన్ అలీ (30; 26 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. డోనోవన్ ఫెరీరా (24), డగ్ బ్రేస్‌వెల్ (23) వేగంగా ఆడినా అది సరిపోలేదు. డర్బన్ బౌలర్లలో జూనియర్ డాలా 4 వికెట్లతో కింగ్స్ పతనాన్ని శాసించాడు. నవీన్ ఉల్ హాక్, ప్రిటోరియస్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఫిబ్రవరి 10న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Irumudi : అయ్యప్ప ‘బంగారు పల్లకి’ సాంగ్ రెడీ అవుతోంది..!
-
24 Carat Gold: బంగారం 24 క్యారెట్లే ఎందుకు? 50 లేదా 100 క్యారెట్లు ఎందుకు ఉండవు? 3,000 ఏళ్ల చరిత్ర.. మీకు తెలుసా?
-
Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!