విలక్షణ నటుడు, పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న తాజా పీరియడ్ చిత్రం ‘కాంత’. ఇప్పటికే విడుదలైన పవర్‌ఫుల్ టీజర్, ఫస్ట్ సింగిల్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ-తెలుగు ద్విభాషా చిత్రంలో సముద్రఖని ఒక కీలక పాత్ర పోషిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్పిరిట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ మరియు వేఫేరర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
Also Read:Spirit : ‘స్పిరిట్’ లో ఎక్కడా చూడని ప్రభాస్ ఎంట్రీ సీక్వెన్స్..!
తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిత్రబృందం ‘కాంత’ సినిమా విడుదల తేదీపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ చిత్రాన్ని మరో మూడు వారాల్లో, అనగా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ చాలా డ్రమాటిక్‌గా, వింటేజ్ ఫీల్‌తో ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో దుల్కర్ సల్మాన్, సముద్రఖని, భాగ్యశ్రీ బోర్సే ముగ్గురూ చాలా సీరియస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కనిపించారు.
Also Read:Bandla Ganesh Party: ప్లేట్ 15వేలు.. నైటుకు కోటిన్నర
1950ల నాటి సినిమా ప్రపంచం
‘కాంత’ చిత్రం 1950ల కాలంనాటి మద్రాస్ (నేటి చెన్నై) నేపథ్యంలో సాగుతుందని టీజర్ ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా ఆనాటి సినిమా ప్రపంచం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక బృందం కూడా చాలా బలంగా ఉంది. సినిమా విడుదలకు కేవలం మూడు వారాలే సమయం ఉండటంతో, ఇకపై ప్రమోషన్ల వేగాన్ని పెంచి, వరుస అప్‌డేట్‌లను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
