Site icon NTV Telugu

Dulam Nageswara Rao: ప్రచారంలో జోరు పెంచిన దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు..

Anupama

Anupama

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడటంతో రాజకీయ పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో జోరు పెంచారు. ఈ క్రమంలో.. ప్రతీ ఇంటికి, ప్రతీ గడపకు వెళ్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాగా.. కైకలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ ప్రచారం నిర్వహించారు. కైకలూరు మండలం వెలమపేటలో ఇంటింటి ప్రచారం ముమ్మరంగా చేశారు.

Pope Francis: ఇటలీలో పడిపోతున్న జనాభాపై ఆందోళన వ్యక్తం చేసిన పోప్ ఫ్రాన్సిస్..

ఈ సందర్భంగా అనుపమ మాట్లాడుతూ… కైకలూరులో వెలమ్మపేటలో ప్రచారం నిర్వహించామని, ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరామన్నారు. అయితే.. ప్రచారంలో మహిళలు స్పందన బాగుందని, జగనన్న అందించిన పథకాలు తమకు అందినవి అని చెప్తుంటే ఆనందమేసిందని తెలిపారు. మరల జగనే సీఎంగా రావాలని కోరుకుంటున్నామని చెప్పుతున్నారన్నారు.

Chhattisgarh: బీజాపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మావోయిస్టులు మృతి..

రేపు కైకలూరుకు సీఎం జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారని తెలిసి ఆనందం వ్యక్తం చేస్తున్నారని.. రేపు జరగబోయే సభకు కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చే అవకాశం ఉందని అనుపమ చెప్పారు. నాలుగు మండలాల్లో తాను తిరిగినప్పుడు మహిళలు ముందుకు వచ్చి అపురూప స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. తాను రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకి వేయమని ఇంటింటికి ప్రచారం చేస్తూ, ఒక ఓటు తమ మామ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఒక ఓటు.. ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ కు ఒక ఓటు వేయమని ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు.

Exit mobile version