ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులే ఉండటంతో ప్రచారం వేగవంతం చేశారు. ఈ సందర్భంగా కైకలూరులో ఇంటింటికి ప్రచారం చేస్తూ.. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు పైన వేయమని ఓటర్లను ఆమె అభ్యర్థిస్తున్నారు. ఒక ఓటు ఎంపీ అభ్యర్థి కారుమూరు సునీల్ కుమార్ యాదవ్ కు మరో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావుకు ఓటు వేయమని కోరారు.
Read Also: Karnataka High Court: పెప్పర్ స్ప్రే చాలా ప్రమాదకరమైన ఆయుధం.. కర్ణాటక హైకోర్టు వెల్లడి
ఇక, ప్రతి గడపకు తిరుగుతుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందించారు అనే విసయాన్ని చెబుతున్నారని దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు అనుపమ తెలిపారు. ప్రతి ఒక్కరు అదే మాట చెప్తుంటే చాలా సంతోషం వేసిందన్నారు. ఇక, స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఆశీర్వదిస్తామని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు.. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన మా ఓటు వేయడానికి డీఎన్ఆర్ కే వేసేందుకు వేచి చూస్తున్నామని ఓటర్లు చెప్పటంతో సంతోషంగా ఉందని దూలం అనుపమ చెప్పుకొచ్చారు.