తమిళంలో సెన్సేషనల్ హిట్ సాధించిన రోమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ‘డ్యూడ్’ (Dude) ఇప్పుడు తెలుగు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ మరియు ‘ప్రేమలు’ బ్యూటీ మమితా బైజు జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించారు. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, ముఖ్యంగా ఇందులోని పాటలు సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. ప్రదీప్ రంగనాథన్ కామెడీ టైమింగ్, మమితా బైజు యాక్టింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. శరత్ కుమార్, రోహిణి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఇప్పుడు ఈ క్రేజీ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్‌ను లాక్ చేసుకుంది.
Also Read : Karuppu: త్రిష వల్లే ‘కరుప్పు’ సినిమాకు కొత్త ఎనర్జీ వచ్చిందంటూ దర్శకుడు ఆసక్తికర కామెంట్స్
ప్రముఖ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు (Zee Telugu) ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. తాజాగా విడుదలైన పోస్టర్ ప్రకారం, ఈ సినిమా ఏప్రిల్ 19, ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. సండే ఈవెనింగ్ ఫ్యామిలీతో కలిసి ఫుల్లుగా నవ్వుకోవడానికి ఇదొక మంచి మూవీ అని చేప్పోచ్చు.
