NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం

Sridhar Babu

Sridhar Babu

కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఐటీ శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు.. ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్ మండలాలల్లో పర్యటించారు. కాటారం మండలం కొత్తపల్లి శివారు పాలిటెక్నిక్ కళాశాలలో రూ. 3 కోట్లతో నిర్మించిన బాలుర హాస్టల్ నీ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు‌.విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కాటారం ప్రభుత్వ హస్పిటల్ లోని డాక్టర్ల క్వార్టర్స్ రూములను ప్రారంభించారు.
Upasana Kamineni తాత పుట్టినరోజు.. ది అపోలో స్టోరీ లాంచ్ చేసిన ఉపాసన

అనంతరం మహాదేవపూర్ మండల కేంద్రంలో రూ.1.20 కోటి నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయంను ప్రారంభించారు. రూ.63 లక్షల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను పూర్తిగా అమలు చేస్తామని , 12 నెలల వ్యవధిలో చిన్న కాళేశ్వరం పనులు పూర్తి చేస్తామని‌, మారుమూల మండలాల‌ అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ రూపోదింస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.ఈ రోజు రాత్రి మావోయిస్ట్ ప్రభావిత పలిమెల మండల కేంద్రంలోని ఎంపీటిసీ గందరా కళ్యాణి,రాజేందర్ ఇంట్లో రాత్రి బస చేయనున్నారు.మంత్రి అటవీప్రాంతంలో బస నేపద్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆరుగ్యారెంటీల అమలులో ఎలాంటి సందేహం లేదని.. ఖజానా ఖాళీ అయినా.. గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కేబినెట్‌లో నిర్ణయించిన అంశాలను మీడియాకు వెల్లడించారు. ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. అన్ని శాఖల వారిగా వివరాలు పరిశీలిస్తున్నామన్నారు.

Minister Jogi Ramesh: వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్‌ కౌంటర్ ఎటాక్.. జగన్ మాటే నాకు ఫైనల్..!