Duddilla Sridhar Babu : నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణాకు తీరని అన్యాయం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేటాయింపులన్నీ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు, ఎన్ డి ఏ భాగస్వామ్య రాష్ట్రాలకు దక్కాయన్నారు. కేంద్ర జిడిపిలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉన్నా ఆమేరకు నిధులు విదల్చలేదని, కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి హక్కు ప్రకారం రావలసిన నిధులు కూడా రాలేదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాష్ట్రం నుంచి పన్నులు రూపంలో రూ.26 వేల కోట్లు కేంద్రానికి వెళ్లాయని, గతంలో కంటే 12 శాతం పెరిగినా రాష్ట్రంపై చిన్నచూపు చూడటానికి రాజకీయ కారణాలే కారణమన్నారు. బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా కూడా తెలంగాణా ప్రజలకు మోదీ ప్రభుత్వం ద్రోహం చేసిందన్నారు. బీహార్, దిల్లీ, ఏపీ, గుజరాత్ లకు మాత్రమే ఫ్రాధాన్యతనివ్వడం కక్ష సాధింపు కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కలు పలుసార్లు ప్రధానితో సహా కేంద్ర మంత్రులను కలిసి రూ.1.63 వేల కోట్ల సహాయం కోసం అర్థించారన్నారు.
Delhi Polls: ఎన్నికల ముందు ఆప్‌కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు..
మెట్రో-2 ప్రాజెక్టు 76.4 కిలోమీటర్ల విస్తరణకు కేంద్రం వాటాగా రూ.17.212 కోట్లు కేటాయించాలని కోరగా రూపాయి కూడా ఇవ్వలేదని, ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్, శివారు మున్సిపాలిటీలకు CSMP కింద భూగర్భ డ్రైనేజీకి నిధులు కేటాయించాలని విన్నవించుకున్నా అన్యాయం చేసారని ఆయన మండిపడ్డారు. మూసీ నది హైదరాబాద్ లో 55కిమీ ప్రవహిస్తోంది. మురుగు కూపంగా మారిన ఈ నది పునరుజ్జీవం కోసం రూ.4 వేల కోట్లు అడిగితే కేంద్రం నిరాశ పర్చిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటీ, నవోదయ, సైనిక్ స్కూల్స్ ను కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని, కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు నిధులు కేటాయించాలని కోరినా రూపాయి ఇవ్వలేదన్నారు. గోదావరి-మూసీ అనుసంధానం ప్రస్తావనే లేదని, MGNREGA పథకం అమలులో వెసులు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు మంత్రి శ్రీధర్‌బాబు.
Pakistan: కాల్పులతో దద్ధరిల్లిన బలూచిస్తాన్.. 18 మంది సైనికులు, 12 మంది ఉగ్రవాదులు హతం..