NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్‌పై ఏడుస్తున్నారు

Sridhar Babu

Sridhar Babu

Duddilla Sridhar Babu : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక శివారులో పత్తిపాక రిజర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చి ఏడాది గడవనే లేదు అంతలోనే అల్లావుద్దీన్ అద్భుతదీపంలా పనిచేయాలని ప్రజల్లో నూరి పోస్తున్నారు బీఆర్ఎస్‌ పార్టీ నాయకులు అని ఆయన అన్నారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు ప్రతిరోజు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఏడుస్తున్నారని, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడిపోయారన్నారు. ఏడాదిలోనే నిరుద్యోగులకు వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది అని ఆయన వ్యాఖ్యానించారు. మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని, సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వద్దని బీఆర్ఎస్ నాయకులు సంకల్ప దీక్ష చేపడతారా అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, పది నెలల్లో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఇచ్చామన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు.

YS Jagan : విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది

అంతేకాకుండా..’మాకు సలహాలు ఇవ్వడానికి ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ పార్టీకి హృదయం ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ నడిపించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ. సోనియా గాంధీ ఆలోచనల్లో విద్యా వైద్యం రైతులకు సాగునీరు వంటివి ఇవ్వడమే సోనియా గాంధీ లక్ష్యం. మేము ఇచ్చిన ప్రజా వాగ్దానాలు తప్పకుండా నెరవేరుస్తాం. గతంలో హరీష్ రావు పత్తిపాకలో పల్లె నిద్ర చేసి రిజర్వాయర్ నిర్మిస్తానని చెప్పి నిర్మించలేక అబద్ధాలు చెప్పాడు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం అయితే ధర్మపురి పెద్దపల్లి నియోజకవర్గంలోని భూములు సస్యశ్యామలం అవుతాయి’ అని మంత్రి శ్రీధర్‌ బాబు వ్యాఖ్యానించారు.

Sanjay Raut: మా ఓటమికి మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ కారణం.. సంజయ్ రౌత్ సంచలన ఆరోపణ..

Show comments