NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటాం..

It Minister Sridhar Babu

It Minister Sridhar Babu

రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం జరిగిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. వర్షాలకు నష్టపోయిన రైతులు జిల్లాలపై అధికారులతో రివ్యూ చేశామని ఆయన తెలిపారు. తెలంగాణలో 8 జిల్లాలకు తీవ్రమైన ప్రభావం పడిందని, ఇరిగేషన్ అధికారులతో పోలీస్ శాఖతో జిహెచ్ఎంసి సిబ్బందితో సమావేశం నిర్వహించామన్నారు. వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి సహాయం చేయాలని నిర్ణయించామని, నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు శ్రీధర్‌ బాబు. అత్యవసర పరిధిలో తప్ప బయటకి ఎవరు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులందరూ కూడా ఫీల్డ్ లో ఉండి పరిస్థితులను సమీక్షించాలన్నారు శ్రీధర్‌ బాబు. విద్యుత్తు, రహదారులు, రోడ్డు నిర్మాణాలను వెంటనే పునర్దించాలని కోరామని, రాష్ట్రస్థాయిలో డిజాస్టర్ బృందాన్ని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించామని ఆయన తెలిపారు.

Rescue Operation: బాపట్ల జిల్లా లంక గ్రామాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు..

అంతేకాకుండా..’పది బృందాలను అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నాడు.. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటాం.. ప్రతి జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మాట్లాడారు.. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుంటున్నారు.. విపత్కర పరిస్థితులను రాజకీయం చేయడం సరైనది కాదు. ఖమ్మంలో తీవ్ర ప్రభావం ఉండడం వలన మంత్రి తుమ్మల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అక్కడే ఉన్నారు.. ఇలాంటి సమయంలో టిఆర్ఎస్ పార్టీ రాజకీయం చేయడం సరికాదు. హరీష్ రావు, కేటీఆర్ బుద్ది ఇప్పటికైనా మార్చుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం తో పాటు ప్రతిపక్ష నేతలు కూడా పాల్గొనాలి.. హరీష్ రావు కేటీఆర్ ముందుకు రండి ప్రజలపై అభిమానం ప్రేమ ఉంటే అధికారులతో కలిసి సహాయం అందించండి. ప్రధాని నరేంద్ర మోడీని కూడా రాష్ట్రం లో పర్యటించాలని ముఖ్యమంత్రి కోరాడు. వర్షాలతో నష్టపోయిన రైతులను ఇల్లు కోల్పోయిన వారికి కలెక్టర్లు అంచనా వేసి రివ్యూ ఇవ్వాలి కోరాం.. వర్షాలతో ఇప్పటివరకు 16 మంది చనిపోయినట్టు రిపోర్టు వచ్చింది.’ అని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు.

Gabbar Singh4k: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కోలాహాలం.. ఆల్ షోస్ హౌస్ ఫుల్స్