మూడు గంటలపాటు రైతులు చెప్పిన మాటలు విన్నామని, మాటలు తక్కువ చెబుతాం, పని ఎక్కువ చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెనిఫెస్టో లో ముత్యంపేట షుగర్ ప్రాజెక్టు తెరిపింఛాలని అన్న అంశం పెట్టించారని, ముందు ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలన్నాడని, ఖజనాలో రూపాయి లేకున్నా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. భోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని పరిశీలించామని ఆయన తెలిపారు. 15 వేల ఎకరాలలో చక్కెర పంట పండిస్తే తప్పు పరిశ్రమ ప్రారంభించే పరిస్థితి ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే జవాబుదారి తనమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. షుగర్ ఫ్యాక్టరీ భూములు బ్యాంకులో తనఖా పెట్టారు.
Sharwanand: అన్నా.. కొద్దిగా గ్యాప్ ఇవ్వరాదే.. ఇప్పటికే మూడు అయ్యాయి
వాటిని బ్యాంకు నుండి విడిపించాలని, మేము ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఇబ్బందులు వచ్చిన పునఃప్రారంభిస్తామన్నారు. చక్కెర ఫ్యాక్టరీ తో పాటుగా ఇథనాల్ ప్రాజెక్టు కూడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని, పదిహేను రోజులకొకసారి అధికారి ఇక్కడికి రావాల్సిందే,నేను కూడా నెల తరువాత ఇక్కడికి వచ్చి సమీక్ష చేస్తానన్నారు. అనుకున్న దాన్ని నిబద్ధత తో అమలు పరుస్తామని, షుగర్ ఫ్యాక్టరీ గేట్లు తెరిచి మొదటి అడుగు వేసామన్నారు. పార్లమెంటు ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని చేస్తున్న పనికాదని, పార్లమెంటు ఎన్నికల తరువాత కూడా మా ప్రభుత్వమే ఉంటుందని ఆయన తెలిపారు. ఆరు గ్యారంటీలని ఖచ్చితంగా అమలు అమలు చేస్తామని, తప్పు దొరకకుండా ముందుకు నడుస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు.
Vinay Bhaskar : ఎన్నికల సమయంలో అమలుకు నోచుకోని దొంగ హామీలను ఇచ్చారు