NTV Telugu Site icon

Duddilla Sridhar Babu : బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే

Duddilla Sridhar Babu

Duddilla Sridhar Babu

నల్లగొండ జిల్లా దేవరకొండలో భట్టి విక్రమార్క పాదయాత్ర ఈరోజు కొనసాగింది. అయితే.. ఈ నేపథ్యంలో దేవరకొండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన భట్టి విక్రమార్క నా శుభాకాంక్షలు అన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకునే విషయంలో, కార్యకర్తలకు భరోసా ఇవ్వడంలో భట్టి విజయం సాధించారని ఆయన కొనియాడారు. 10 సంవత్సరాలు పూర్తికాకముందే దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ జరపడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.

Also Read : Off The Record: జెండా మార్చిన పదవి దక్కలేదా..? ఆశపడితే నిరాశే మిగిలిందా?

అంతేకాకుండా.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా తూకం, తాలు పేరుతో చేసిన మోసం రైతన్నకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతుందని ఆయన ధ్వజమెత్తారు. ధరణి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన విధానంతో ఉందని, ఇప్పటికే రైతు డిక్లరేషన్, యువతకు డిక్లరేషన్ ఇచ్చామన్నారు. ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో అభివృద్ధికి నోచుకోని వర్గాలు ఉన్నాయి… వారికి బీఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read : Shubman Gill Wicket: ఒరేయ్ అంపైరు.. కళ్లు కాకులు మింగాయా?