Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Dsp Nalini Rejected The Offer Given By Cm Revanth Reddy

Dsp Nalini: సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ పై స్పందించిన నళిని.. సార్ అంటూ ఎమోషనల్ పోస్ట్

Published Date :December 17, 2023 , 10:43 am
By Bhanu
Dsp Nalini: సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ పై స్పందించిన నళిని.. సార్ అంటూ ఎమోషనల్ పోస్ట్
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Dsp Nalini: తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేసిన మాజీ డీఎస్పీ నళిని ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చారు. ఉద్యోగానికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అయితే గత ప్రభుత్వాలు ఆమెకు సరైన గుర్తింపు ఇవ్వలేదనే చెప్పాలి. తాజాగా ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. పోలీస్ శాఖలో మాజీ డీఎస్పీ నళినికి అదే ఉద్యోగం ఇవ్వడంలో ఇబ్బంది ఏమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నళినికి ఉద్యోగంపై ఆసక్తి ఉంటే వెంటనే విధుల్లో చేరాలని సీఎస్, డీజీపీలను సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో మార్గదర్శకాలకు సంబంధించి అడ్డంకులు ఉంటే అదే స్థానంలో మరో శాఖలో ఉద్యోగం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. అయితే దీనిపై మాజీ డీఎస్పీ నళిని స్పందించారు.

గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారు.. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ళ ముందు కదులుతుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ‘సోషల్ స్టిగ్మా ( మరక)’ను మోసానని తెలిపారు. నన్ను ఆనాటి ప్రభుత్వం 3 ఏండ్లు చాలా ఇబ్బంది పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణక్షణం ఒక గండంలా గడిచిందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు, 2009 డిసెంబర్ 9 న నేను చేసిన రాజీనామా చాలా సంచలనం రేకెత్తించిందని తెలిపారు. అదే రాత్రి చిదంబరం చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చిందన్నారు. నాటి సీఎం రోశయ్య గారు మహిళ దినోత్సవం రోజున నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగి ఇస్తున్నట్లు ప్రకటిస్తే ,నేను రాజీనామాను విత్ డ్రా చేసుకొని డిపార్ట్మెంట్ లో చేరానని తెలిపారు. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే అన్నారు.

Also Read

  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!
  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
  • Nandyal Bus Accident: గేదెలను తప్పించే క్రమంలో ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 34 మంది ప్రయాణికులు
  • Tamil Nadu politics: తమిళనాడు రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌.. నకిలీ మద్దతు లేఖ వివాదం..! గవర్నర్‌, పీఎస్‌లో ఫిర్యాదు..
Add as a preferred
source on google

Read also: Reliance New Plan : మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు అంబానీ మాస్టర్ ప్లాన్

18 నెలలు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయన్నారు. ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ లో పోస్టింగ్ ఇచ్చి,నాకు ఛార్జ్ మెమోలు ఇచ్చి ఎక్స్ప్లనేషన్ రాయమనడం వార్షిక రహస్య నివేదిక (annuval confidencial reports)లో అడ్వర్స్ (చెడు) రిమార్క్ రాయడం, బ్యాచ్ లో నా ఒక్క దానికే ప్రమోషన్ ను ఆపేయడం, ప్రోబేషన్ పీరియడ్ ఎక్స్టెండ్ చేయడం వంటివి చేశారు. నన్ను ఒంటరిని చేసి ఒక కానిస్టేబుల్ కంటే హీనంగా ట్రీట్ చేశారు. ఈ విషయాలు అన్ని నన్ను ఆనాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి మొర పెట్టుకొనేలా చేశాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నాకు వారి అప్పాయింట్ మెంట్ కూడా దొరకలేదు.బయట ఉద్యమ నాయకులను సంప్రదిస్తే వాళ్ళు నాకు సహాయం చేయక పోగా, నన్ను ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారికి,సోనియా గాంధీ జీ కి లేఖలు రాసి నా పరిస్తితి ని, రాష్ర్ట దుస్థితినీ వివరించా. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్ళీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 1.11.2011 న ఫార్మాట్ లో డీజీపీ కి రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్ళను.

శ్రీ కృష్ణ కమిటీ ప్రభావంగా జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించా. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్ చేసింది.దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు అందులో ఉన్నాయి. అన్ని పత్రికల్లో నా ఫోటోలు వేసి ఈ వార్తను పెద్దగా రాసి హై లైట్ చేశారు.ఆ నాడే నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది. సుష్మా స్వరాజ్ గారు నల్గొండ సభకు ఆ రోజే రావడం, నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకోవడం నాకు కాస్త స్వాంతన చేకూర్చింది. నా లోని ఒక డైనమిక్ కమిటెడ్ ఆఫీసర్ ను ఆ రోజే హత్య చేశారు. ఈ నాడు 12 ఏండ్లు పూర్తి అయిన తర్వాత తెలంగాణా మూలాలు కల ఒక సీఎంగా మీరు నా కేస్ ను వెలికితీయడం చాలా సంతోషంగా వుంది. దాని వెనుక వున్న మరణ కారణం తెలుసుకోవాలి అనుకుంటున్నారు.చాలా చాలా సంతోషం. ఇన్నాళ్లకు నా పోరాటాన్ని, సంఘర్షణను జనం తెలుసుకొనే ఒక సందర్భం సృష్టించారు. మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మీ ద్వారా తెలంగాణ ఉద్యమంలో బ్రతికి బయటపడి సర్వస్వం కోల్పోయిన వాళ్ళలో నేను ముందు వరుసలో ఉన్నానన్న విషయం ప్రజలకు అర్థం అయ్యింది. నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నది నిరూపణ అయ్యింది. ఉద్యమములో నిర్వహించిన కీలక మైన పాత్ర నన్ను ప్రజలకు దగ్గర చేసింది.

Read also: Kerala: మెట్రో స్టేషన్‌కి దారి చూపిస్తానని.. 52 ఏళ్ల మహిళపై వ్యక్తి అత్యాచారం..

కాని నా బంధు మిత్ర పరివారం మాత్రం అందరూ నన్ను వెలివేశారు.solitary confinement అనే శిక్షను 10 ఏండ్లు అనుభవించా అన్నారు. పర్యవసానంగా ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నీ కోల్పోయాను. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవచ్చవం లా బతికానని తెలిపారు. రెండేండ్ల క్రితం దేవుడి దయ వల్ల నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించాడు.వేదమాత, యజ్ఞ దేవతలు నాలో తిరిగి ప్రాణం పోశారు.అందుకే నేను నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకు సమర్పించుకున్నాను. జీవితంలో పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. చాలు.ఇంకా నేను ఎవరి కోసం ఇంకెటువంటి త్యాగమూ చేయలేను .జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా,వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం.దీని వల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు, సమాజ ఉన్నతికి కూడా పాటు పడిచ్చు.కాబట్టి నా పంథా మర్చుకొలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్ కాకుండా వేరే ఉద్యోగం కూడా నేను చేయలేను.ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యురోక్రసి కి వెచ్చించలేను.

శ్రేయో మార్గం విడిచి మళ్ళీ ప్రేయో మార్గం వైపు రాలేను.అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ, పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వరుడు క్రిమినాలోజీ ( న్యాయ దర్శనం) నుండి ఫిలాసఫీ( తత్త్వ శాస్త్రం) వైపు నడిపించాడు. గన్ స్థానంలో నా చేత వేదం పట్టించాడు.నా వాణి లో మాధుర్యం నింపి నన్ను ఆచార్య ను చేశాడు. నా ఈ ప్రస్థానం (డీఎస్పీ నుండి డిఎన్ఎ గా మారడం) చాలా సంఘర్షణ మయం, వేదనా భరితం.నన్ను ఈ ఉద్యోగం నుండి ఎవరూ సస్పెండ్ చేయలేరు.నేను దీనికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎన్నడూ కలగవు.కాబట్టి అంతిమంగా నేను.. సీఎంగా మిమ్మల్ని కోరేది ఏమిటంటే నా పై కరుణ చూపి స్టేటస్ కో కు అనుమతించండి. నాలా ఇంకే ఆఫీసర్ డిపార్ట్మెంట్ లో ఇబ్బందులు పడకుండా తగిన చర్యలు తీసుకోండి.మీలో మంచి స్పార్క్ ఉంది.మీ నుండి చక్కని పాలన ఆశించవచ్చు అనిపిస్తుంది. మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది. కాబట్టి నాలో లోకేషన, విత్తేషనలు కూడా పోయాయన్నారు.

ఇక నాకు మీరు న్యాయం చేయాలి అంటే నాకు ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా నా ధర్మ ప్రచారానికి ఉపయోగ పడేలా ఏదైనా సహాయం చేస్తే స్వీకరిస్తాను.ఎందుకంటే మీరు రాజు, నేను బ్రాహ్మణిని.మీరు ఇచ్చే ప్రభుత్వ ఫండ్ ను నేను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ ,సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్తాను. ( నేను మిమ్మల్ని కలవాలి. కాని ప్రస్తుతం సనాతన ధర్మానికి మూలాలైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. హిందీ ప్రూఫ్ చూసే పనిలో బిజీ గా ఉన్నాను. మహర్షి 200 వ జయంతి వరకు అది సిద్ధం కావాలి.సమయం ఎక్కువగా లేదు.అందుకే అది అయిపోగానే దాన్ని ప్రింటింగ్ కు ఇచ్చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఈ లోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలని ఇంటర్వ్యూ అడుగుతున్నారు. అందుకే ఇలా నా ఫేస్బుక్ లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
Reliance New Plan : మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు అంబానీ మాస్టర్ ప్లాన్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Appeals to CM Revanth
  • CM Revanth Reddy
  • DSP Nalini
  • DSP Nalini Messege
  • EX DSP Nalini

తాజావార్తలు

  • Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్‌కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!

  • Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్‌..!

  • Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!

  • Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?

  • Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్‌తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions