DSC Notification: ఉపాధ్యాయుల ఉద్యోగాల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న అభ్యర్థులకు శుభవార్త.. టెట్‌లో అర్హత సాధించి డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారా? అయితే, మీరు సిద్ధం కావాల్సిన సమయం రానే వచ్చింది.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే డీఎస్సీ నోటిఫకేషన్ విడుదల కాబోతోంది.. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం జిల్లా రాజాం ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దగ్గర ఉందని.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రకటన కోసం సీఎం కసరత్తు చేస్తున్నారని వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Read Also: GST Council: ఆన్‌లైన్ గేమింగ్‌పై 28శాతం పన్ను విధించేందుకు కౌన్సిల్ నిర్ణయం
కాగా, మరోవైపు గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే ఖాళీల భర్తీకి సీఎం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుండగా.. దీంతో, ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న లెక్కలను తీసే పనిలో అధికారులు మునిగిపోయారట.. మొత్తం 12 శాఖల్లో ఖాళీలున్నట్లు కూడా తెలుస్తుండగా.. ఎన్నికలు సమీపిస్తుండడంతో.. వరుసగా వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.