DSC notification: ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ… త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం అన్నారు.. సీఎం వై ఎస్ జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారన్న ఆయన.. ఉపాధ్యాయులు, ఉద్యోగుల బదిలీలపై సమీక్షించాం.. త్వరలో బదిలీలపై కూడా నిర్ణయం తీసుకుంటాం అన్నారు.. బదిలీలకు పరదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం.. ఇందు కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా పరిశీలిస్తున్నాం అన్నారు.
Read Also: PM Modi: గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మారింది.. డిజిటల్ చెల్లింపుల్లో భారత్ నెంబర్ వన్..
ఇక, విశాఖపట్నం పరిపాలన రాజధాని మా పాలసి.. మేం డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదన్నారు బొత్స.. చంద్రబాబు అమరావతిలో రాజధానిని కాపురం కోసం పెట్టాడా? అని ప్రశ్నించిన ఆయన.. అమరావతి రాజధాని అయితే చంద్రబాబు కాపురం హైదరాబాద్ లో ఎందుకు పెట్టారు? కాపురానికి, రాజధానికి సంబంధం ఏంటి? అని నిలదీశారు.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొందరు మాట్లాడారు.. ఈ రోజు బిడ్డింగ్ తో ఆ విషయం స్పష్టమైందన్నారు.. మేం చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం.. కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అన్నారు.. మరోవైపు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జోస్యం చెప్పిన బొత్స.. చంద్రబాబు మంచి నటుడు, మ్యానిపులేటర్ అంటూ మండిపడ్డారు.. కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై పరిశీలిస్తున్నాం.. సీఎం వై ఎస్ జగన్ దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. పరీక్షలు, ఒంటి పూట బడుల వలన చిక్కిలు ఇస్తున్నామని తెలిపారు మంత్రి బొత్స సత్యనారాయణ.