NTV Telugu Site icon

DS Chauhan : ఇప్పటి వరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

Ds Chauhan

Ds Chauhan

DS Chauhan : ఇప్పటి వరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం ఖరీదు 3,045.76 కోట్లు అని, సన్నాలకు 9.21 కోట్ల బోనస్ చెల్లింపులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 23 నాటికి 90 శాతం బోనస్ చెల్లింపులు అవుతాయన్నారు. సాంకేతిక కారణాలతో చెల్లింపులలో జాప్యం అయ్యిందని ఆయన పేర్కొన్నారు. సంవత్సరాంతంలో పిడిఎస్ బియ్యం నిలువరింపు చేస్తున్నట్లు, జనవరి నుండి సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వ మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో 2.81 లక్షల మందికి ప్రయోజనం కలగనుందన్నారు. లొసుగులను అడ్డుకునేందుకే ధాన్యం కొనుగోలులో సంస్కరణలు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు.

Rajnath Singh: కోటి దీపోత్సవ ప్రభ మాటలకందని విధంగా ఉంది..

పాత పాలసీలో లోపాలతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని, 2014 నుండి 2023 వరకు కార్పొరేషన్ పై 58,623 కోట్ల భారం పడిందన్నారు. సంవత్సరంలోగా 11,608 కోట్ల రికవరీ చేస్తామని, బ్యాంక్‌ గ్యారెంటీ పై అపోహలు వద్దన్నారు. సియంఆర్ బియ్యం ప్రభుత్వానికి చేరంగానే బ్యాంక్ గ్యారెంటీ వాపస్ వస్తుందన్నారు. బ్యాంక్ గ్యారెంటీతో మరోదానికి ముడి పెట్టె ప్రసక్తి లేదని, లీజ్ పేరుతో మోసాలను అరికట్టేందుకే నో డ్యూస్ సర్టిఫికెట్లు తప్పనిసరి అని ఆయన అన్నారు. ప్రభుత్వ పరంగా ధాన్యం కేటాయింపులు ఉండవని, ధాన్యం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డ వారికి కేటాయింపులు ఉండవన్నారు. అవకతవకలకు పాల్పడ్డ మిల్లర్లు 362 మందని, అవకతవకలకు పాల్పడని రైస్ మిల్లర్లకు 10%బ్యాంక్ గ్యారెంటీ, అవకతవ్వకలకు పాల్పడి తిరిగి అసలు పెనాల్టీ చెల్లించిన వారికి 20 శాతం విధిస్తున్నామన్నారు.

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌