తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి దేవేంద్రసింగ్ చౌహాన్ గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పౌరసరఫరాల శాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు, ఆలోచనలకు అనుగుణంగా అధికారులందరూ సమిష్టిగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని ఆ ఆశలను అమలుచేయడానికి ప్రభుత్వం ముందుకెళ్తుందని ఇటువంటి కీలక సమయంలో అధికారుల పనితీరు మరింత మెరుగుపడాలని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యమై పౌరసరఫరాల శాఖ పేరు ప్రతిష్టలు మరింత పెరిగేలా కృషిచేయాలన్నారు.
Also Read : Meera Chopra: పెళ్ళికి సిద్దమైన పవన్ హీరోయిన్..
తాను దాదాపు పది సంవత్సరాలు పోలీస్ విభాగానికి బయట పనిచేయడం జరిగిందన్నారు. ప్రతిచోట సమస్యలు, సవాళ్ళు ఉంటాయని వాటిని ఎదుర్కొని పరిష్కరించినప్పుడే మన పనితీరు ఏంటో తెలుస్తుందన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. బాగా పనిచేస్తే అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే ఈ సందర్భంగా అనిల్ కుమార్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. మూడున్నర సంవత్సరాలుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా పనిచేసి వి.అనిల్ కుమార్‌కు ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Also Read : Central Govt: జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్‌పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధింపు