NTV Telugu Site icon

Dry Hair Solution: ఈ హెయిర్ మాస్క్‌ను అప్లై చేస్తే.. 15 రోజుల్లో ఒత్తైన, నల్ల జుట్టు మీ సొంతం!

Dry Hair Solution

Dry Hair Solution

Flaxseed Hair Mask for Dry Hair: వాతావరణం మారిన వెంటనే జుట్టు రాలడం, పొడిబారడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే జుట్టును హైడ్రేట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇందుకు అవిసె గింజల (లిన్సీడ్) హెయిర్ మాస్క్‌ బాగా ఉపయోగపడుతుంది. అవిసె గింజలు ప్రోటీన్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మీ జుట్టును పొడవుగా మరియు మందంగా చేయడంలో సహాయపడుతుంది. విటమిన్లు బీ మరియు ఈ కూడా అవిసె గింజలలో ఉంటాయి. ఇవి తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి.. మీ జుట్టును బలంగా చేస్తుంది. అవిసె గింజల హెయిర్ మాస్క్‌ తయారుచేసే విధానాన్ని ఇప్పుడు చూద్దాం.

# లిన్సీడ్ హెయిర్ మాస్క్ తయారీకి కావలసిన పదార్థాలు (Ingredients for Flaxseed Hair Mask):
అవిసె గింజలు – 2 టీస్పూన్లు
బియ్యం- 2 టేబుల్ స్పూన్లు

Also Read: Maruti Brezza Price 2023: కేవలం 5 లక్షలకే మారుతి బ్రెజా.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు!

# లిన్సీడ్ హెయిర్ మాస్క్ తయారు చేసే విధానం (How to Make Flaxseed Hair Mask):
లిన్సీడ్ హెయిర్ మాస్క్ చేయడానికి ముందుగా ఒక పాన్లో 1 గ్లాసు నీరు పోయాలి. అందులో 2 చెంచాల లిన్సీడ్ గింజలు మరియు 2 స్పూన్ల బియ్యం వేయాలి. ఇప్పుడు 10-12 నిమిషాలు ఉడకబెట్టండి. ఉడికిన తర్వాత జెల్ మాదిరి మిశ్రమం వచ్చాక గ్యాస్‌ను ఆపివేయండి. ఆ తర్వాత వడగట్టి గిన్నెలోకి తీసుకోవాలి.

# లిన్సీడ్ హెయిర్ మాస్క్‌ని ఎలా అప్లై చేయాలంటే? (How to use Flaxseed Hair Mask):
లిన్సీడ్ హెయిర్ మాస్క్‌ని మీ జుట్టు మీద బాగా అప్లై చేయండి. అప్లై చేశాక సుమారు 1 గంట పాటు ఉంచండి. ఆపై జుట్టును బాగా కడిగి శుభ్రం చేసుకోండి. ఈ మిశ్రమాన్ని 15 రోజుల పాటు వాడితే జుట్టు సమస్యలన్నీ దూరమవుతాయి. మీ జుట్టు ఒత్తుగా మరియు మెరిసేలా కనిపిస్తుంది.

Also Read: Canada PM Divorce: 18 ఏళ్ల వైవాహిక బంధానికి కెనడా ప్రధాని స్వస్తి.. అది మాత్రం కొనసాగుతుందంటూ..!

Show comments