పీకలదాకా మద్యం సేవించిన ఓ యువకుడు అతని మిత్రుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన ట్రాఫిక్ పోలీసులపైనే దాడికి దిగిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు తనిఖీలు చేపట్టిన పోలీసులపైనే దాడి చేసి విధులకు ఆటంకం కలిగించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జగిత్యాల ట్రాఫిక్ ఎస్ఐ రామ్ తెలిపిన వివరాల మేరకు గొల్లపల్లి రోడ్ లో మంగళవారం రాత్రి ట్రాఫిక్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు చేపట్టారు. ఈ క్రమంలో అటుగా బైక్ పై వచ్చిన పట్టణానికి చెందిన దయ్యాల మహేష్ , చెట్ట మహేందర్ లను తనిఖీల నిమిత్తం సిబ్బంది ఆపారు. అనంతరం బైక్ నడిపిన మహేష్ కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేసే క్రమంలో నిరాకరించాడని తెలిపారు.
Also Read : NCRB Data: జైళ్ల కెపాసిటీ 4.4లక్షలు.. కానీ ఖైదీలు 5.5లక్షలు
అంతేకాకుండా మరో యువకుడు మహేందర్ తో కలిసి టెస్ట్ చేయడానికి “మీరు ఎవరు రా అంటూ” పోలీసులపై ఇస్టారీతిన అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న హోంగార్డుపై దాడి చేసి కొట్టారని పేర్కొన్నారు. ఈ మేరకు హోంగార్డ్ రాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే పోలీసులపైకి దాడి చేయడానికి యత్నించిన యువకుడు అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్ బంధువు కావడం గమనార్హం. గతంలో సదరు కౌన్సిలర్ సైతం మద్యం మత్తులో విధుల్లో ఉన్న పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించడమే కాకుండా ఎమ్మెల్యేపై అధికార పార్టీ పట్ల ఇష్టారీతిన మాట్లాడటం కొసమెరుపు.
Also Read : Gold Silver Price Today: మరింత పైకి ఎగబాకిన పసిడి ధర.. ఈ రోజు ఎంతంటే..?