Site icon NTV Telugu

Drunken Police : మద్యం మత్తులో కానిస్టేబుల్‌ వీరంగం.. నడిరోడ్డుపై లారీలు ఆపి..

Drunken Police

Drunken Police

డ్యూటీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ మద్యం మత్తులో నడిరోడ్డుపై లారీలను ఆపి వీరంగం సృష్టించాడు. కానిస్టేబుల్ వీరంగానికి ఆ ప్రాంగణం పూర్తిగా వాహనాలకు అంతరాయం ఏర్పడింది. ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను ప్రశ్నించిన వారిపైకి బూతు పురాణాలతో నోటికి వచ్చిన బూతులతో తిడుతూ నానా హంగామా సృష్టించాడు. ఈ సంఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కోత్వాల్ గూడ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది.

Also Read : G20: ప్రతీకారం కోసం పాశ్చాత్య దేశాల ప్రయత్నం.. రష్యా ఘాటు వ్యాఖ్యలు..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న జి రాజా మల్లయ్య గత అర్ధరాత్రి పీకలదాకా మద్యం సేవించి తన ఇట్టికా కారును రోడ్డు మధ్యలో ఆపి మట్టి లోడుతో వెళ్తున్న టిప్పర్లను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. గచ్చిబౌలి నుండి కారులో వస్తున్న అశ్వీన్ రెడ్డి దంపతులను సైతం ఆపి నోటికి వచ్చిన బూతు పురాణాలతో తిడుతూ పైపైకి వచ్చాడని తెలిపారు.

Also Read : Off The Record: లాబీయింగ్ వర్కవుట్ అయ్యేనా?

దీంతో 100 నెంబర్ కు కాల్ చేసిన అశ్విన్ రెడ్డి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ పెట్రోల్ మోబైల్ మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ ను స్టేషన్ కు తరలించారు. అయితే కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేసిన అశ్వన్ రెడ్డి. కానిస్టేబుల్ రాజమల్లయ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు.

Exit mobile version