Site icon NTV Telugu

Drunken Drive : దిల్‌సుఖ్‌నగర్‌లో మందుబాబుల వీరంగం.. నగ్నంగా..

Drunken Drive

Drunken Drive

నిషా నెత్తికెక్కి ఏం చేస్తారో తెలియదు కొందరికి. అలాంటి సంఘటనే నిన్న రాత్రి దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకుంది. నిన్న రాత్రి.. మలక్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మందు బాబు నగ్నంగా హల్‌చల్‌ చేశాడు. దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్ చౌక్ వద్ద మలక్ పేట ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ మందు బాబు మద్యం మత్తులో తన గుడ్డలు ఊడదీసి నగ్నంగా పోలీసులపై తిరగబడుతూ బూతులు తిట్టాడు. దీంతో ట్రాఫిక్ కాప్స్ ఆవాక్కయ్యారు. దిల్‌సుఖ్ నగర్ రాజీవ్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

 

మందుబాబుకి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు.. వాహనాని సీజ్ చేసి స్టేషన్‌ తరలించారు ట్రాఫిక్‌ పోలీసులు. దీంతో.. మందుబాబు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చోటు చేసుకున్నాయి. గతంలో ఓ యువతి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో దొరికి.. పోలీసులపైనే తిరగబడిన ఘటనలు జరిగాయి.

Exit mobile version