Drunkard Hulchul: విశాఖపట్నంలో ఓ మందుబాబు హల్‌చల్ చేశాడు. ట్రాఫిక్ పోలీసులపై మందుబాబు వీరంగం సృష్టించాడు. విశాఖలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండగా ఇద్దరు స్నేహితులు తాగి బండిపై వచ్చారు. వారిలో ఓ వ్యక్తి అక్కడి నుంచి పరారీ కాగా.. మరో వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ఒకానొక దశలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై ఆ యువకుడు చేయి చేసుకున్నాడు. ఆ పోలీసు చొక్కాను పట్టుకున్నాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ యువకుడిని కొట్టాడు. ఈ క్రమంలోనే ఆ యువకుడు కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కొట్టాడు. అక్కడ ఉన్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకున్నారు. అతడిని పోలీసు వాహనంలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీసు అధికారిపై చేయి చేసుకున్నందుకు కేసు నమోదు చేసే అవకాశం ఉంది.
Drunkard Hulchul: మత్తులో ఖాకీలపై చిందులు.. నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను కొట్టిన మందుబాబు..
![Drunk And Drive](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/05/Drunk-and-Drive-1024x576.jpg)
Drunk And Drive