Site icon NTV Telugu

Drunk SI: తప్పతాగి పక్కింటికి వెళ్లిన ఎస్ఐ.. చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు

Drunk Si

Drunk Si

Drunk SI: తప్పతాగి తన ఇల్లు అనుకొని పక్కింటిపోయి ఎస్ఐ ఇరుక్కుపోయాడు డోరు కొట్టినా.. ఎంతకీ తీయకపోవడంతో గోడ దూకే ప్రయత్నం చేశాడు. దొంగేమో పారిపోతున్నాడనుకున్న ఇంటివాళ్లు ఆ ఎస్ఐని పట్టుకున్నారు. ఇంకేముంది చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జడ్చర్ల సర్కిల్ పరిధిలోని రాజాపూర్ మండలంలో శ్రీనివాసులు ఎస్‌ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ వెళ్లాడు. ఫుల్‎గా మద్యం సేవించిన ఎస్ఐని బుధవారం తెల్లవారుజామున తాను నివాసం ఉంటున్న జడ్చర్ల హౌసింగ్ బోర్డ్ కాలనీలో కారు డ్రైవర్ దించి వెళ్లాడు.

Read Also: Hyderabad : టీబీపై యుద్ధం.. రోగుల సమాచారం ఇస్తే ఖరీదైన బహుమతి

సివిల్ డ్రెస్ లో ఉన్న ఆ ఎస్‌ఐ తాగిన మైకంలో తన ఇంటికి కాకుండా.. కొంత దూరంలో ఉన్న మరో ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. ఆ తర్వాత గోడ దూకే ప్రయత్నం చేయడంతో స్థానికులు దొంగగా భావించి చెట్టుకు కట్టేసి చితకబాదారు. అతను నిజం చెప్పకుండా ఎస్ఐ అని ఒకసారి, సీఐ అని మరోసారి, కానిస్టేబుల్ని అని పొంతన లేని సమాధానం ఇవ్వడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులకు విషయం తెలవడంతో మరీ అంతలా తాగడం ఎంటని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మందు ఫ్రీగా వచ్చినట్టుంది అందుకే సారు గారు పీకలదాకా తాగారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version