Drunk and Driving: జర్రుంటే సచ్చిపోతుండేగా.. కారుతో తాగుబోతు బీభత్సం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk and Driving: బెంగళూరులోని ఇందిరానగర్ 100 అడుగుల రోడ్డులో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి ఒక రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Also Read
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
- Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
- TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
- నేటి నుంచి BRICS ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్-2026.. 10 దేశాల ప్రతినిధులతో కీలక చర్చలు..!
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం 42 ఏళ్ల డెరిక్ టోనీ అనే వ్యక్తి తన స్కోడా కారులో 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంతో పాటు మద్యం సేవించి ఉండటంతో కారుపై నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా అతివేగం కారణంగా టోనీ కారును తిప్పలేకపోయాడు.
దానితో కారు నేరుగా వెళ్లి డివైడర్‌ను ఎక్కి అవతలి వైపునకు దూసుకెళ్లింది. దారిలో ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న సెకన్ల వీడియోలో.. కారు మెరుపు వేగంతో డివైడర్‌ను దాటుకుంటూ రావడం చూడవచ్చు. తృటిలో అక్కడ నిలబడ్డ వ్యక్తులకు తగలకుండా కారు గోడను ఢీకొట్టింది. అక్కడ నిలబడ్డవారు జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి అక్కడినుంచి కంటి రెప్పపాటు సమయంలో తప్పించుకున్నారు. లేకపోతే ఎన్ని ప్రాణాలు పోయేవో మరి.
Odisha Flight Crash: ఒడిశాలో ఘోర ప్రమాదం.. చార్టర్డ్ ఫ్లైట్ కూలి
అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రెస్టారెంట్ బయట ఉన్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. ఘటనలో కారు ఢీకొట్టిన బైక్ ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.
Drunk Driver Crashes Into Indiranagar Restaurant, Pedestrians Escape Narrowly,Car seized.
Bengaluru
A major accident was narrowly averted late Thursday night on #Indiranagar’s bustling 100 Feet Road when a drunk driver lost control of his car, jumped a divider, and rammed… pic.twitter.com/sA8mMj0Ikb
— Yasir Mushtaq (@path2shah) January 10, 2026
తాజావార్తలు
-
Govinda: 7 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. మనసులోని బాధ బయటపెట్టిన గోవింద
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!