Site icon NTV Telugu

Drunk and Driving: జర్ర ఉంటే ఎన్ని ప్రాణాలు పోయేవో.. కారుతో తాగుబోతు బీభత్సం..!

Drunk And Driving

Drunk And Driving

Drunk and Driving: బెంగళూరులోని ఇందిరానగర్ 100 అడుగుల రోడ్డులో గురువారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి ఒక రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

Komatireddy Venkat Reddy: సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా.. పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదు..!

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం 42 ఏళ్ల డెరిక్ టోనీ అనే వ్యక్తి తన స్కోడా కారులో 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఆ సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతివేగంతో పాటు మద్యం సేవించి ఉండటంతో కారుపై నియంత్రణ కోల్పోయాడు. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా అతివేగం కారణంగా టోనీ కారును తిప్పలేకపోయాడు.

దానితో కారు నేరుగా వెళ్లి డివైడర్‌ను ఎక్కి అవతలి వైపునకు దూసుకెళ్లింది. దారిలో ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్‌లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వైరల్ అవుతున్న సెకన్ల వీడియోలో.. కారు మెరుపు వేగంతో డివైడర్‌ను దాటుకుంటూ రావడం చూడవచ్చు. తృటిలో అక్కడ నిలబడ్డ వ్యక్తులకు తగలకుండా కారు గోడను ఢీకొట్టింది. అక్కడ నిలబడ్డవారు జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి అక్కడినుంచి కంటి రెప్పపాటు సమయంలో తప్పించుకున్నారు. లేకపోతే ఎన్ని ప్రాణాలు పోయేవో మరి.

Odisha Flight Crash: ఒడిశాలో ఘోర ప్రమాదం.. చార్టర్డ్ ఫ్లైట్ కూలి

అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. రెస్టారెంట్ బయట ఉన్న వారందరూ క్షేమంగా బయటపడ్డారు. ఘటనలో కారు ఢీకొట్టిన బైక్ ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు.

Exit mobile version