Drugs Case: రూ. 2,000 కోట్ల డ్రగ్స్ రాకెట్.. మాస్టర్‌మైండ్ సినీ నిర్మాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
International Drug Trafficking Racket: భారత దేశంలో మరోసారి అంతర్జాతీయ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్ గుట్టురట్టయ్యింది. ఢిల్లీ పోలీసులు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌ను అధికారులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. మాదక ద్రవ్యాలను తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాన్ని పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత ఉన్నట్లు గుర్తించారు. అయితే ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడట.
అంతర్జాతీయ స్థాయిలో సూడోఫెడ్రిన్‌కు భారీగా డిమాండ్ ఉంది. మెథాంఫేటమిన్ తయారీలో సూడోఫెడ్రిన్‌ను వినియోగిస్తారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, మలేషియాలో కిలో రూ.1.5 కోట్లకు విక్రయిస్తున్నారు. ఆ మూడు దేశాలకు పెద్ద మొత్తంలో సూడోఫెడ్రిన్ పంపుతున్నట్లు ఎన్‌సీబీకి సమాచారం తెలిసింది. సూడోఫెడ్రిన్‌ను హెల్త్ మిక్స్ పొడులు, కొబ్బరి సంబంధిత ఆహార ఉత్పత్తులతో కలిపి సముద్ర మార్గంలో రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మాదకద్రవ్యాల మాఫియా కదలికలపై ఎన్‌సీబీ నిఘా పెట్టింది. సరకును ఆస్ట్రేలియాకు పంపడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read
- Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
Also Read: Vijay Sankalp Yatra: నేడు తెలంగాణకు గుజరాత్ సీఎం.. కిషన్ రెడ్డి షెడ్యూల్ ఇదే..!
ఢిల్లీ పోలీసులు, ఎన్‌సీబీ అధికారులు ఫిబ్రవరి 15న పశ్చిమ ఢిల్లీలోని దారాపుర్‌లోని గోదాంలో సోదాలు నిర్వహించి 50 కిలోల సూడోఫెడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ డ్రగ్ నెట్‌వర్క్ భారత్ సహా మలేసియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు విస్తరించినట్లు విచారణలో తేలింది. ఈ ముఠా ఇప్పటి వరకు 3500 కిలోల సూడోఫెడ్రిన్ ఉన్న 45 పార్శిళ్లను ఎగుమతి చేసిందని, వాటి విలువ రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుందని తేలింది. డ్రగ్స్ అక్రమ స్వాధీనం, వ్యాపారం చేయడంతో నిందితులకు 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!