గోవా విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు DRI అధికారులు. 12 కోట్ల విలువ చేసే 5.2 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు. ఓ ప్రయాణికురాలు ఇథియోపియా నుండి హెరాయిన్ తీసుకొస్తుండగా గోవాలో పట్టుకున్నారు. అయితే గోవా ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. వారి కళ్లు గప్పి ట్రాలీ బ్యాగ్ లో డ్రగ్స్ తీసుకొని బయటకు వచ్చింది కిలాడీ లేడి. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను ట్రాలీ బ్యాగ్ కింద భాగంలో దాచి తరలించే యత్నం చేసింది లేడి కిలాడీ.
ABHB: ఇంట్లో ఆడపిల్ల పుడితే రూ.21 వేలు ప్రకటించిన ప్రభుత్వం
అయితే అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత ఆ మహిళ ఓ హోటల్ కు చేరుకుంది. అనంతరం సమాచారం అందుకున్న DRI అధికారులు.. ఆ లేడి బస చేస్తున్న హోటల్ వెళ్లి తనిఖీలు చేయగా.. డ్రగ్స్ లభ్యమైంది. అనంతరం హెరాయిన్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ డ్రగ్స్ ను ఢిల్లీలో ఓ వ్యక్తికి అప్ప చెప్పెందుకు ప్రయాణికురాలు వెళ్తున్నట్లు సమాచారం. చాకచక్యంగా వ్యవహరించిన DRI అధికారులు డ్రగ్స్ రాకెట్ ను గుట్టరట్టు చేశారు. గతంలోను డ్రగ్స్ విదేశాల నుంచి తీసుకొస్తూ ఢిల్లీ కస్టమ్స్ కు పట్టుబడింది నిందితురాలు. NDP’s యాక్ట్ కింద ఆ మహిళపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు Dri అధికారులు.
