NTV Telugu Site icon

Drug Peddling Gang Arrested: మత్తు పదార్థాలకు అడ్డాగా హైదరాబాద్.. భారీగా గంజాయి పట్టివేత

Drugs

Drugs

Drug Peddling Gang Arrested: హైదరాబాద్ నగరం రోజురోజుకి మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా అని అనిపిస్తోంది. గత కొద్దిరోజుల నుంచి నగర పోలీసులు, ఎస్టిఎఫ్ పోలీసులు దాడుల నేపథ్యంలో పబ్బులు, ప్రవేట్ పార్టీలలో పెద్ద సంఖ్యలో ఈ మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. మరోవైపు కొందరు గంజాయి విక్రయించే గ్యాంగులు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ఎవరికైనా గంజాయి, డ్రగ్స్ కావాలంటే కేవలం ఫోన్ చేస్తే చాలు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి డెలివరీ చేసేలా సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తాజాగా మరోసారి హైదరాబాద్ మహానగరంలో మత్తు పదార్థాలు దొరికాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Akkineni : గ్రాండ్ గా ‘జైనాబ్’ తో అక్కినేని అఖిల్ నిశ్చితార్ధం

గంజాయి, ఎండిఎంఎ, ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్‌ ఏది కావాలన్నా ఇస్తామని కస్టమర్లకు ఫోన్లు చేస్తూ డ్రగ్స్‌ అమ్మకాలు జరిపే ముఠాను మంగళవారం ఎక్సైజ్‌ ఎస్టిఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. గోల్కండ ఎక్సైజ్‌ పోలీస్‌ పరిధిలోని షేక్‌పేట్‌, టోలీ చౌక్‌ ప్రాంతాల్లో కార్లలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్టిఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌ బృందం తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఒక కారులో ఒక యువతి, ఒక వ్యక్తి కూర్చోని ఉన్నారు. మరో వ్యక్తి స్కూటీపై వచ్చి గంజాయి ప్యాకెట్‌ను కారులో ఉన్న వ్యక్తులకు ఇస్తూ ఉండగా.. ఎక్సైజ్‌ ఎస్టిఎఫ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్కూటీపై వచ్చిన వ్యక్తి వద్ద నుంచి ఒక కిలో గంజాయి స్వాధీనం చేసుకున్న, అనంతరం కారులో తనిఖీలు నిర్వహించగా అందులో 1.7 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దింతో మొత్తంగా 2.7 కిలోల గంజాయి, 11గ్రాముల ఎండిఎంఎ, 3 ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్‌ లభించాయి.

Also Read: Youngest Players IPL: 2025 వేలంలో అమ్ముడైన అత్యంత పిన్న వయస్కులు వీళ్లే..

గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతూ పట్టుబడిన నిందితుల్లో సాయి బాబు, వెంకటరెడ్డి, సోనియా ఎలిషా అలియాస్‌ ప్రియాంకలను అరెస్టు చేసి గోల్కండ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు. డ్రగ్స్‌ను ఎస్టిఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌, ఎస్సై శ్రీనివాస్‌, శ్రీకాంత్‌, సాయి కుమార్‌, కరణ్‌, ప్రసాద్‌, తరుణి, నిఖిల్‌ లు పట్టుకున్నారు. ఒకే చోటు మూడు రకాల డ్రగ్స్‌ను అమ్మకాలు జరుపుతున్న నిందితులను పట్టుకున్న ఎస్టిఎఫ్ సిబ్బందని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విబి కమలాసన్‌రెడ్డి, అసిస్టేంట్‌ డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌రెడ్డి అభినందించారు.